అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి , ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క మహిళా దర్శకురాలు కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది.
ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో పలువురు లేడీ డైరెక్టర్స్ తమ ప్రతిభను చాటుకున్నారు. మంచి విజయాలు కూడా అందుకున్నారు. ‘అలా మొదలైంది’, ‘కళ్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 లో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య… ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ గా తమ మార్క్ చూపించారు.
తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే కూడా దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సిరి చౌదరి, పింగ్ పాంగ్ సూర్య, జబర్దస్త్ అభి, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాబు కొల్లబాతుల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ ఉదగండ్ల ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. రచన, దర్శకత్వం బాధ్యతలు సంజన అన్నేనిర్వహిస్తున్నారు. కాగా, బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా కూడా సంజన తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.