Entertainment

డైరెక్టర్ గా విజయ్ కుమారుడి మొదటి సినిమా.. హీరోగా బిగ్ స్టార్!


కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అతన్ని డైరెక్టర్ గా పరిచయం చేస్తోంది. గతేడాది ఆగస్టులోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. అయితే ఇందులో హీరో ఎవరు? ప్రీ ప్రొడక్షన్ వర్క్, షూటింగ్ అప్డేట్స్ ఏంటి? వంటి వాటి గురించి పెద్దగా సమాచారం లేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

జాసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న మొదటి సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దుల్కర్ రంగంలోకి దిగుతున్నాడంటే.. ఈ మూవీ మంచి కంటెంట్ తో భారీస్థాయిలో రూపొందనుంది అనడంలో సందేహం లేదు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కుమారుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్.. అనతికాలంలోనే తనదైన మార్క్ చూపించాడు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి హీరోతో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ మొదటి సినిమా చేయనుండటం ఆసక్తికరంగా మారింది.

మామూలుగా హీరోల కుమారులు హీరోలుగానే ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కానీ జాసన్ సంజయ్ మాత్రం తన తండ్రి విజయ్ బాటలో పయనించకుండా.. డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి దర్శకుడిగా జాసన్ సంజయ్ ఎలాంటి మార్క్ చూపిస్తాడో చూడాలి.

 



Source link

Related posts

తిరుపతిలో హీరోయిన్ శ్రీలీల..అభిమాని కోసం ప్రసాదం తెచ్చింది

Oknews

వెయ్యి కోట్లు టార్గెట్‌ చేసిన ‘హనుమాన్‌’.. ఎలాగంటే..!

Oknews

అతనితో నిజాయితీగా ఉన్నానంటున్న అవతార్ డైరెక్టర్..ఆర్ఆర్ఆర్ టీం గర్వం 

Oknews

Leave a Comment