EntertainmentLatest News

డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ సాంగ్ లాంచ్


పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో శ్రీధర్ వర్మ సాగి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి కథను ఎంచుకొని, వినోదభరితమైన చిత్రాన్ని అందించడమే లక్ష్యంగా ఎంతో కష్టపడుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.

సుకుమార్ పమ్మి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. ఈ చిత్రానికి సుకుమార్ అద్భుతమైన పాటలు అందిస్తున్నారట. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చందమామే’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో ప్రముఖ దర్శకుడు పరశురామ్ చేతుల మీదుగా లాంచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా డైరెక్టర్ పరశురామ్ చిత్ర యూనిట్ ని అభినందించారు. 

‘చందమామే’ సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. మరి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘రవికుల రఘురామ’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.



Source link

Related posts

సైలెంట్ గా వచ్చేసిన సత్యభామ.. ఏం చేస్తుందో..!

Oknews

Ys Sharmila Invites Pawan Kalyan To Her Sons Wedding

Oknews

‘కల్కి’ రిలీజ్‌తో వెలవెలబోతున్న ఓటీటీలు.. ఈవారం విడుదలయ్యే సినిమాలివే!

Oknews

Leave a Comment