డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ రెండోసారి పెళ్లి పీటలెక్కింది. శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహాన్ని ఎంతో ఘనంగా చేశారు శంకర్. ఈ వివాహ మహోత్సవానికి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి సీనియర్ నరేష్ కూడా అటెండ్ అయ్యారు. ఈ పెళ్లికి హాజరవడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. పెళ్లిలో శంకర్ చేసిన అతిథి మర్యాదలు ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నారు. నూతన వధూవరులకు తన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
2021లో ఐశ్వర్య శంకర్ వివాహం క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్ళయిన కొన్ని నెలలకే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. క్రికెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న రోహిత్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవరిస్తున్నాడని పలు ఫిర్యాదులు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇది తెలిసిన ఐశ్వర్య అతని నుంచి విడిపోయింది. అప్పటి నుంచి శంకర్ దగ్గరే ఉంటోంది. అతని దగ్గరే అసిస్టెంగ్ పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య.