ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యకిరణ్ చికిత్స పొందుతూ సోమవారం నాడు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ధన 51′, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజుభాయ్’, ‘చాప్టర్ 6’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. అయితే సూర్యకిరణ్ ఓ ప్రముఖ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లాడిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు.
దర్శకుడు సూర్యకిరణ్ ప్రేమించి పెళ్లాడిన హీరోయిన్ ఎవరో కాదు.. కళ్యాణి. మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తెలుగులో ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’, ‘పెళ్ళాంతో పనేంటి’, ‘వసంతం’, ‘కబడ్డీ కబడ్డీ’, ‘పెదబాబు’ వంటి సినిమాలలో నటించింది. 2002- 2005 సమయంలో కళ్యాణికి తెలుగులో ఎంతో డిమాండ్ ఉండేది. అంతలా ప్రేక్షకులకు చేరువైన కళ్యాణి.. సూర్యకిరణ్ మనసు దోచింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏవో కారణాల వల్ల ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు.