EntertainmentLatest News

డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!


మిస్టరీ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ కి ఉండే ఫ్యాన్సే వేరు. క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలలో ఉండే సస్పెన్స్ కోసం ప్రతీ ప్రేక్షకుడు ఎదురుచూస్తుంటాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి జానర్ వచ్చిన వాటిల్లో ఓ పెద్ద లిస్టే ఉంది.

శ్రీరామ్ నటించిన ‘ ఎకో ‘ మూవీ ఇప్పటికీ థ్రిల్లర్ లవర్స్ కి గుర్తుండే సినిమా.‌ వధువు, వళరి లాంటి హారర్ థ్రిల్లర్ సినిమాలు మంచి హిట్ టాక్ ని తెచ్చుకున్నాయి. గతేడాది డిసెంబర్ లో విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో నాగ చైతన్య నటించిన ‘ దూత ‘ వెబ్ సిరీస్ కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా అమేజాన్ ప్రైమ్ వీడియోలో నవీన్ చంద్ర నటించిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ ఇన్ స్పెక్టర్ రిషి ‘ . ఇప్పుడు ఇది ఓటీటీ వేదికపై అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంటోంది‌. ఇప్పుడు ఈ సిరీస్ మాదిరి మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా రానుంది. మనోజ్ బాజ్ పాయ్ లీడ్ రోల్ లో నటించిన ‘ సైలెన్స్ ‘ సినిమా 2021 లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అది కూడా ఓటీటీలోకి నేరుగా రానుండటం విశేషం. ‘సైలైన్స్ 2.. ది నైట్ ఔల్ బార్ షూటౌట్ ‘ గా ఈ సినిమా రీలీజ్ అవ్వనుంది.

ప్రాచీ దేశాయ్, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 16 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అయితే దీనిని మొదటగా హిందీ వర్షన్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే.. నగరంలో వరుస హత్యలు చేస్తున్న హంతకులని పట్టుకోవడానికి  ఏసీపీగా మనోజ్ బాజ్ పాయ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. మరికొన్ని రాజుల్లో వచ్చే ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా ట్రైలర్ ని చూడనివాళ్ళు ఓ సారి చూసెయ్యండి.



Source link

Related posts

‘లిటిల్ మిస్ నైనా’ మూవీ రివ్యూ

Oknews

చంచల్‌గూడ జైలుకి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు!

Oknews

హీరో  గోపీచంద్  గురించి మాట్లాడనున్న తెలంగాణ మంత్రి సీతక్క   

Oknews

Leave a Comment