Health Care

డొపమైన్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ నయా ఫ్యాషన్ ఎందుకంత స్పెషల్ ?


దిశ, ఫీచర్స్ : మీరు ఆనందంగా ఉండటంలో, దానిని సెలబ్రేట్ చేసుకోవడంలో సెల్ఫ్-ఎక్స్‌ప్రెషన్స్, ఎంపవర్ మెంట్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఫ్యాషన్ వరల్డ్ గురించి గనుక చెప్పుకుంటే వార్డ్‌రోబ్‌ను క్యూరేట్ చేస్తున్న ప్రతి వ్యక్తికి ఇది ఒక్కసారైనా అనుభవంలోకి వస్తుంది. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకోవడం, ధరించడం అనేది సౌందర్యానికి మించిన మధుర అనుభూతికి కారణం అవుతుంది. ఇదే ప్రజెంట్ ‘డొపమైన్ డ్రెస్సింగ్’ ట్రెండుగా ఉద్భవించింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా మంది దీని గురించి చర్చిస్తున్నారు.

కలర్ ఫుల్ వార్డ్‌రోబ్

‘డొపమైన్ డ్రెస్సింగ్ ట్రెండ్’ ఐడియా వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటంటే.. మీరు ధరించేది దుస్తులు మీ మానసిక స్థితిని లేదా శ్రేయస్సును గణనీయంగా ప్రభావితం చేస్తాయనే నమ్మకంతో పాతుకుపోయింది. న్యూరో ట్రా‌న్స్‌మిటర్ డొపమైన్ అనేది హ్యాపీనెస్ అండ్ సర్‌ప్రైజ్‌తో ముడిపడి ఉన్నట్లే.. వార్డ్‌రోబ్‌లో శక్తివంతమైన, సంతోషకరమైన రంగు రంగుల దుస్తులను కలిగి ఉండటం, అవసరానికి యూజ్ చేయడం సానుకూల భావోద్వేగాలను ప్రేరేపిస్తుందని ప్రజలు, ముఖ్యంగా మహిళలు నమ్ముతుంటారు. పైగా ‘డ్రెస్సింగ్ అండ్ ఎమోషన్స్ బలంగా అనుసంధానించబడిన వాస్తవాన్ని’ వ్యక్తులు గుర్తిస్తున్నందున ఈ ట్రెండ్ పాపులర్ అవుతోంది.

మారుతున్న క్లాతింగ్ స్టైల్

రంగు రంగుల దుస్తులు, అల్లికలు, క్లాతింగ్ స్టైల్స్ కూడా మారుతున్న కాలంతోపాటు ట్రెండింగ్‌లో ఉంటాయి. ముఖ్యంగా ఆనందాన్ని, సానుకూల భావాన్ని ప్రేరేపించే శక్తివంతమైన, అలాగే డొపమైన్ హార్మోన్లను విడుదల చేయడంలోనూ కొన్ని రంగులు, డిజైన్లు ప్రముఖంగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు. తమ స్టైల్‌కు అనుగుణంగా దుస్తులు ధరించడమనే నయా ట్రెండ్ సౌందర్యానికి మించి, ఫ్యాషన్ యొక్క మానసిక, భావోద్వేగ కోణాలను అనుభూతి చెందేలా చేస్తోంది.

ఇంపాక్ట్ ఆఫ్ కలర్స్

డొపమైన్ అనేది ‘ఫీల్-గుడ్’ న్యూరో ట్రాన్స్‌మిటర్ హార్మోన్. ఇది మానసిక స్థితి, ఆనందం, ప్రేరణ వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రజలు తమకు నచ్చిన కొన్ని రంగులకు గురికావడం వల్ల చక్కటి అనుభూతి పొందుతారు. ఈ స్థితి మెదడులో డొపమైన్ విడుదలను మరింత ప్రేరేపిస్తుంది. ఇది భావోద్వేగాలు, అవగాహనలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ విన్నిపెగ్ నిపుణులు ‘ఇంపాక్ట్ ఆఫ్ కలర్ ఇన్ మార్కెటింగ్’ అనే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన అలాంటి డొపమైన్ డ్రెస్సింగ్స్ ఏవో చూద్దాం.

వైబ్రంట్ హ్యూస్‌ అండ్ ప్రింట్స్

మీ పర్సనల్ స్టైల్‌కు అనుగుణంగా బ్రైట్ అండ్ లైవ్‌లీగా ఉండే ఉల్లాసమైన రంగులతో మీ వార్డ్‌రోబ్‌ను నింపండి. ముఖ్యంగా బోల్డ్ రెడ్, సన్నీ యెల్లో లేదా శక్తివంతమైన డైమండ్ రంగులు వంటి మీలో శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రంగులను ఎంచుకోండి. అలాగే ప్రింట్స్ అండ్ పాటర్న్స్ విషయానికి వస్తే ఇవి మీకు ఆనందాన్ని కలిగించే వాటినే ఎంచుకోండి. ముఖ్యంగా ఫ్లోరల్ ప్రింట్స్, చారలు లేదా జియోమెట్రిక్ నమూనాలు ఆనందకరమైన రంగుల ప్యాలెట్స్ తక్షణమే మీ ఉత్సాహాన్ని పెంచుతాయి.

బోల్డ్ యాక్సెసరీస్ – కలర్ సైకాలజీ

మీరు పూర్తిగా కలర్‌ఫుల్ ఎసెంబుల్‌కి కట్టుబడి ఉండటానికి రెడీగా లేకుంటే బోల్డ్ యాక్సెసరీలను చేర్చండి. వైబ్రంట్ హ్యాండ్‌ బ్యాగ్, ఒక జత స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ లేదా రంగురంగుల బూట్లు సరళమైన దుస్తులకు కూడా ఉత్సాహాన్ని జోడించగలవు. అలాగే కలర్ సైకాలజీతో కూడా మిమ్మల్ని మీరు వ్యక్తపరచుకోండి. అందుకోసం వివిధ రంగుల మానసిక ప్రభావాన్ని పరిగణించండి. ఉదాహరణకు.. ఎరుపు రంగు శక్తికి, అభిరుచికి, పసుపు రంగు ఆనందానికి, ఆశా వాదానికి, నీలం రంగు ప్రశాంతకు నిదర్శనంగా పేర్కొంటారు. అలా మిమ్మల్ని, మీ భావోద్వేగాలను పాజిటివ్‌గా ప్రేరేపించే రంగులను ఎంచుకోండి.

పాలెట్‌ పర్సనలైజేషన్

మీ ఐడియల్ డొపమైన్ డ్రెస్సింగ్ పాలెట్ అనేది కచ్చితంగా ప్రత్యేకమైనది. మీ వ్యక్తిత్వానికి అనుగుణంగా, మీకు మంచి అనుభూతిని కలిగించే రంగులపై తప్పక శ్రద్ధ వహించండి. అది పాస్టెల్స్, జ్యువెల్ టోన్స్ లేదా ఎర్తీ‌షేడ్స్ ఏవైనా సరే, వాటితో మీ ఇండివిడ్యువల్ స్టైల్ అండ్ ప్రిఫరెన్స్‌ను ప్రతిబింబించే వార్డ్‌రోబ్‌ను క్రియేట్ చేయండి. ఎందుకంటే డొపమైన్ డ్రెస్సింగ్ సౌందర్య ఆకర్షణకు మించిన ఆనందాన్ని ఇస్తుంది. పాజిటివ్ మైండ్ సెట్‌ను, శ్రేయస్సును ప్రేరేపిస్తుంది. మీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్‌ను పెంచుతుంది. ఆనందాన్ని కలిగించే దుస్తులను ఉద్దేశపూర్వకంగా ఎంచుకోవడం ద్వారా సెల్ఫ్‌లవ్ అండ్ పాజిటివిటీ యొక్క ధరించగలిగే వ్యక్తీకరణను క్రియేట్ చేసుకోగలుగుతారు.



Source link

Related posts

ఆత్మహత్య ధోరణిలో యువత.. సినిమాలోని సీన్స్, ధైర్యం కోల్పోవడమే కారణమా!

Oknews

మీ లవ్ సక్సెస్ కావాలనుకుంటున్నారా.. అయితే ఈ ఏకాదశికి ఇలా చేయండి..

Oknews

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువంట!

Oknews

Leave a Comment