ఒక పాత తెలుగు సినిమాలో నిను వీడని నీడను నేనే అనే ఒక ఫేమస్ పాట ఉంటుంది. ఇప్పుడు ఈ పాట తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరెక్టుగా వర్తిస్తుంది.కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమని డ్రగ్స్ వ్యవహారం ఒక కుదుపు కుదిపింది.అఫ్ కోర్స్ అడపాదడపా కుదుపుతునే ఉంది. ఇంకా దాని తాలూకు కేసు కూడా పూర్తి కాలేదు.కొన్నాళ్ల నుంచి డ్రగ్స్ వ్యవహారం లో ప్రశాంతంగా ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ తాజాగా మళ్ళీ ఒకసారిగా ఉలిక్కి పడింది.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగ్ లో డ్రగ్స్ ఉన్నాయనే పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు దాడి జరిపారు. ఈ దాడుల్లో లావణ్య అనే యువతీ దగ్గర ఉన్న 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ దొరికింది. పోలీసులు ఆ డ్రగ్ ని సీజ్ చేసి లావణ్య ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమ దర్యాప్తులో లావణ్య ప్రముఖ హీరో ప్రేయసిగా పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. అలాగే ఆ డ్రగ్ ని గోవాని తెప్పించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారని ఆ దిశగా తమ దర్యాప్తుని మొదలుపెట్టిన్నట్టుగా కూడా సమాచారం
గత కొన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమపై డ్రగ్స్ నీడలు పడుతూనే ఉన్నాయి.ఎవరో కొంత మంది చేసిన పనికి పరిశ్రమ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అలాగే ఇప్పుడు ప్రముఖ హీరో లవర్ లావణ్య డ్రగ్స్ కేసులో దొరకడంతో సినిమా పరిశ్రమకి చెందిన ఇంకెంత మంది పేర్లు వస్తాయో అని కూడా అందరు అనుకుంటున్నారు. ఆ హీరో ఇటీవలే ఒక బిగ్ హీరో మూవీలో మంచి క్యారక్టర్ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.