Health Care

డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. అంతే సంగతి..


దిశ, ఫీచర్స్ : రోజువారీ పనులను చురుకుగా చేసుకునేందుకు, అలాగే బలంగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో రోజు ప్రారంభించడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నిజానికి డ్రై ఫ్రూట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుండి అలసట, బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకలను బలోపేతం చేసి, రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేసే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తినడానికి సరైన సమయం చాలా మందికి తెలిసుండదు. కొంతమంది ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటారు. దాని వల్ల లాభాలకు బదులు నష్టాలను చవిచూస్తుంటారు. డ్రై ఫ్రూట్స్ తప్పుడు పద్ధతిలో తినడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఏ డ్రై ఫ్రూట్స్ తినకూడదు, దాని వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కిస్మిస్..

ఎండుద్రాక్షలో షుగర్ పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో లేదా ఉదయాన్నే ఎండుద్రాక్ష తినడం వల్ల మీ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇప్పటికే మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష అస్సలు తినకూడదట. దీనితో పాటు కొంతమందికి కొన్నిరకాల అలెర్జీలు కూడా వస్తాయట. అందుకే వైద్యుడిని సంప్రదించకుండా ఎండుద్రాక్ష తినకూడదని చెబుతున్నారు.

ఖర్జూరం..

ఖర్జూరం తింటే వేడి కలుగుతుంది. అందుకే వేసవి కాలంలో వీటిని తినకూడదని డైటీషియన్లు చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తినకూడదు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తినకూడదని చెబుతున్నారు.



Source link

Related posts

రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేస్తున్నారా.. ఎలా నడిస్తే మంచిదో తెలుసా..

Oknews

బ్రెయిన్ షార్పుగా పనిచేయాలా?.. ఆహారంలో ఇవి తప్పక చేర్చండి !

Oknews

షాపింగ్‌ చేస్తున్నారా?.. ఖర్చు తగ్గాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి !

Oknews

Leave a Comment