EntertainmentLatest News

తండ్రికి షాక్‌ ఇచ్చిన కూతురు.. రజినీ కెరీర్‌లోనే ఇది ఫస్ట్ టైమ్!


‘జైలర్‌’ సినిమాకి ముందు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రేంజ్‌ వేరు, ‘జైలర్‌’ తర్వాతి రేంజ్‌ వేరు. ఇప్పటివరకు తమిళ సినిమా చరిత్రలో ‘జైలర్‌’ అంతటి కలెక్షన్స్‌ సాధించిన సినిమా లేదు. అంతటి ఘనకీర్తిని సొంతం చేసుకున్న రజినీకాంత్‌కి ఆయన కుమార్తె అపకీర్తి తీసుకొచ్చింది. తండ్రితో ఒక డిజాస్టర్‌ మూవీని తెరకెక్కించి రజినీకాంత్‌తోపాటు అతని అభిమానులకు కూడా షాక్‌ ఇచ్చింది. సాధారణంగా రజినీకాంత్‌ సినిమా రిలీజ్‌ అవుతోందంటే ఆ బజ్‌ వేరేలా ఉంటుంది. అయితే దానికి భిన్నంగా తాజాగా రిలీజ్‌ అయిన ‘లాల్‌ సలామ్‌’ సినిమాకి చడీచప్పుడు లేదు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమాలో రజినీ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ, సినిమా రిలీజ్‌ అయిన తర్వాత సీన్‌ రివర్స్‌ అయిందని గుర్తించారు ప్రేక్షకులు. అది అతిథి పాత్ర కాదు, ప్రధాన పాత్ర అని తెలుసుకొని ముక్కున వేలేసుకున్నారు. 

‘లాల్‌ సలామ్‌’ చిత్రానికి రజినీ కుమార్తె ఐశ్వర రజినీకాంత్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి తమిళ్‌లో, తెలుగులో ఓపెనింగ్స్‌ రాకపోవడం, కలెక్షన్స్‌ చాలా దారుణంగా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విష్ణు విశాల్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో విక్రాంత్‌ మరో ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్ని అందించడం మరో ఆకర్షణగా చెప్పుకున్నారు. సినిమాటోగ్రఫీ అందించిన విష్ణు రంగస్వామి కథ, స్క్రీన్‌ప్లే కూడా సమకూర్చారు. అయితే ఇవేవీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయాయి. కొన్ని థియేటర్లలో ఓపెనింగ్స్‌ లేకపోవడంతో ‘లాల్‌ సలామ్‌’ తీసేసి వేరే సినిమా వేసుకున్నారని తెలుస్తోంది. ఇలా జరగడానికి కారణం.. సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్‌ చేయకపోవడమేనని ట్రేడ్‌వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రజినీకాంత్‌, నిర్మాతలు, దర్శకురాలు ఎవరూ సినిమాని ప్రమోట్‌ చెయ్యడానికి ముందుకు రాలేదు. అయితే తమిళ్‌లో కూడా ఓపెనింగ్స్‌ రాని పరిస్థితి ఉందంటేనే ఎక్కువ ఆశ్చర్యం కలుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు రూ.18.50 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేసిందంటేనే ‘లాల్‌ సలామ్‌’ ఎంత పెద్ద డిజాస్టరో అర్థమవుతుంది. ఆదివారం కలెక్షన్స్‌ మరింత పడిపోవడం ఇంకా దారుణమని చెప్పొచ్చు. ఎవరికి ఎలా ఉన్నా.. రజినీకాంత్‌కి మాత్రం ఇది పెద్ద షాక్‌ అనే చెప్పాలి. ‘జైలర్‌’కి ముందు రజినీకాంత్‌ సినిమాలు కొన్ని బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. అయితే ‘జైలర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ‘లాల్‌ సలామ్‌’కి ఇలాంటి రిజల్ట్‌ వచ్చిందంటే ఆశ్చర్యంగానే ఉంది. ఈ సినిమా టోటల్‌ బడ్జెట్‌ రూ.90 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. అందులో రజినీకాంత్‌ పారితోషికమే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్‌ కెరీర్‌లో ‘లాల్‌ సలామ్‌’ పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 



Source link

Related posts

అభ్యర్థుల జాబితా.. కాంగ్రెస్ బీభత్సమైన స్ట్రాటజీ!

Oknews

ఆ సినిమాను థియేటర్‌లో చూసి ఆడియన్స్‌ షాక్‌ అవుతారంటున్న ఉపేంద్ర!

Oknews

Easily track cyber attacks across your industry and supply chain

Oknews

Leave a Comment