యాదమ్మ రాజు-స్టెల్లా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరికీ బుల్లితెర మీద మంచి పేరు ఉంది. ఇద్దరూ లవ్ మ్యారేజ్ కూడా చేసుకుని ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. వీళ్ళు ఒక డాన్స్ షోలో చేసారు. ఇక ఇప్పుడు యాదమ్మ రాజు “కిర్రాక్ బాయ్స్ – కిలాడి గర్ల్స్” షోలో చేస్తున్నాడు. ‘పటాస్’ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు.. సద్దాంతో కలిసి స్కిట్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ బుల్లితెర మీద అలరిస్తున్నాడు. ప్రస్తుతం ‘జబర్దస్త్’లో కమెడియన్ గా ఉన్న యాదమ్మ రాజు కొన్ని మూవీస్ లో కనిపించాడు. అలా స్టాండప్ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పేశాడు. తన భార్య స్టెల్లా ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని వెల్లడించాడు.
“ఎనిమిదేళ్ల అపురూపమైన ప్రేమ..ఏడాదిన్నర వైవాహిక జీవితం, ఊహించని సవాళ్లు, కష్టాలు, కన్నీళ్లు. ప్రతీ కష్టం లోనూ మమ్మల్ని మేము స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు, సంతోషంతో నిండిన హృదయాలతో, మా ఫామిలీలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ వార్త మాలో అంతులేని ఆనందాన్ని నింపింది. మేము కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు చాలా సంతోషిస్తున్నాము. మీ దీవెనలు, ప్రేమ మాకు ఇవ్వండి. అందరికీ ధన్యవాదాలు” అంటూ మామ్ – డాడ్ అనే అక్షరాలు ఉన్న కాప్స్ పెట్టుకుని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసారు.