ఒక్కోసారి మనకు తెలియకుండా జరిగిన తప్పుకి లేదా మన పక్కనున్న వాళ్లు చేసిన దానికి.. మనం విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటీవల అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)కు అలాంటి అనుభవమే ఎదురైంది. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో నాగార్జున వెళ్తుండగా.. ఒక అభిమాని ఆయనను కలవడం కోసం దగ్గరకు రాబోయాడు. దాంతో పక్కనున్న బాడీ గార్డ్.. ఆ అభిమానిని పక్కకి నెట్టేశాడు. ఇది గమనించని నాగార్జున అలాగే వెళ్ళిపోయాడు. అయితే ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయనపై కొందరు విమర్శలు గుప్పించారు. దీంతో నాగ్ క్షమాపణలు చెప్పాడు. ఈ విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, భవిష్యత్ లో ఇలాంటివి పునావృతం కాకుండా చూసుకుంటానని తెలిపాడు. ఇక ఇప్పుడు నాగార్జున చేసిన పని.. ప్రశంసలు అందుకుంటోంది.
ఎయిర్ పోర్ట్ లో తన బాడీ గార్డ్ నెట్టేసిన అభిమానితో తాజాగా నాగార్జున ఫొటో దిగాడు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని అభిమానిని నవ్వుతూ పలకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నాగార్జున తప్పు సరిద్దుకున్నాడు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం “అసలు ఇందులో నాగార్జున తప్పు ఎక్కడుంది. తనకు తెలియకుండా జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పడమే కాకుండా.. అభిమానిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మంచి మనసుని చాటుకున్నాడు.” అని ప్రశంసలు కురిపిస్తున్నారు.