EntertainmentLatest News

తమిళనాడు టీవీల్లో చిరంజీవి..కారణం అదే


మెగాస్టార్ చిరంజీవికి తమిళనాడులో భారీగానే అభిమానగణం ఉంది. తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచే  చిరంజీవి సినిమాలు తమిళనాడు ప్రజలకి సుపరిచితం. లేటెస్ట్ గా చిరంజీవికి సంబంధించిన ఒక వార్త తమిళనాడులో ఉన్న చిరు ఫాన్స్ లో ఉత్తేజాన్ని నింపుతుంది.

సంక్రాంతికి వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని నమోదు చేసింది. మాస్ మహారాజ రవితేజ ,చిరులు కలిసి చేసిన ఆ సినిమా వసూళ్ళ పరంగా కూడా  చిరంజీవి గత చిత్రాల కంటే ఎక్కువే  సాధించింది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా తమిళనాడు టీవీ ల్లో రాబోతుంది. ప్రముఖ ఛానెల్ విజయ్ టెలివిజన్ లో వాల్తేరు వీరయ్య రేపు మధ్యాహ్నం 3 గంటలకి తమిళ వెర్షన్ లో  టెలికాస్ట్ అవ్వబోతుంది. దీంతో తమినాడులోని మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

చిరంజీవి గత చిత్రమైన సైరా నరసింహారెడ్డి తమిళనాడు టీవీల్లో ప్రసారమయినప్పుడు 15.44 టీఆర్పీ రేటింగ్ నమోదు  అయ్యింది. టాలీవుడ్ చిత్రాల్లో  ఇదొక భారీ రికార్డుగా ఉంది. మరి ఇప్పుడు  వాల్తేరు వీరయ్య తో చిరు తన రికార్డు ని  బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి. బాబీ దర్శకత్వంలో వచ్చిన  ఈ మూవీలో  చిరంజీవి  సరసన   శృతి హాసన్  హీరోయిన్ గా  నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలని చేపట్టారు. ఆల్రెడీ వాల్తేరు వీరయ్య తెలుగు లో కూడా స్మాల్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి మంచి అదరణనే పొందింది.



Source link

Related posts

Stone Attack On Chandrababu చంద్రబాబుకి కూడా స్పాట్ పెట్టారు

Oknews

పెళ్లి అయితే తగ్గాలా..కుర్రకారు మతి పోగొడుతున్న నటి 

Oknews

‘సలార్‌’ హక్కులను చేజార్చుకున్న దిల్‌రాజు… కారణం ఎవరు?

Oknews

Leave a Comment