హైదరాబాద్ కి చెందిన అచ్చ తెలుగు నటి ప్రియాంక నల్కరి. తన సినీ ప్రస్థానం తెలుగులో ప్రారంభం అయినా కూడా తమిళంలో రోజా అనే సీరియల్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. 2018 నుండి 2022 వరకు ఏకధాటిగా సాగిన ఆ సీరియల్ ద్వారా ప్రియాంక తమిళనాడు వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.తాజాగా ఆమెకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
సంవత్సరం క్రితం ప్రియాంక ప్రముఖ నటుడు బిజినెస్ మాన్ అయిన రాహుల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎవరకి చెప్పకుండా సడన్ గా రాహుల్ ని పెళ్లి చేసుకొని అందరకి షాక్ ఇచ్చింది.ఈ వివాహం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది పైగా మలేషియాలో సెటిల్ అయిపోతున్నానని ఇకపై నటిగా కొనసాగనని కూడా ఆమె చెప్పింది.ఇక అసలు విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ప్రియాంక కొన్ని రోజుల క్రితం తన అకౌంట్ లో నుంచి తన భర్త రాహుల్ కి సంబంధించిన పిక్స్ ని డిలీట్ చేసింది. అలాగే విషాదకరమైన పోస్టులని కూడా అప్ లోడ్ చేస్తు వస్తుంది.దీంతో ఆమె ఫాలోవర్స్ కొంత మంది రాహుల్ తో విడిపోయారా అని ఇన్ స్టా వేదికగా అడిగారు.దీంతో ప్రియాంక రాహుల్ తో విడిపోయానని రిప్లై ఇచ్చింది. కాకపోతే ఎందుకు విడిపోయిందో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె విషయం తెలుగు తమిళనాట సంచలనం సృష్టిస్తుంది.
ప్రియాంక తెలుగులో ఎస్ఎంఎస్, అందరి బంధువయ్య, సంథింగ్ సంథింగ్, కిక్ 2, హైపర్, నేనే రాజు నేనే మంత్రి, వైఫ్ ఆప్ రామ్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ద్వారా రాని గుర్తింపుని బుల్లితెర ప్రియాంకకి తెచ్చిపెట్టింది. ఆహ్వానం, మేఘమాల, మంగమ్మ గారి మనవరాలు, శ్రావణ మేఘాలు వంటి సీరియల్స్ చేసి తన అధ్బుతమైన నటనతో అశేష అభిమానుల ప్రేక్షకుల మనసుని చూరగొంది. తమిళనాడులో రోజా సీరియల్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తనకి ఏర్పడింది.ప్రియాంక ప్రస్తుతం జీ తమిళంలో నల దమయంతి సీరియల్ చేస్తుంది.