Health Care

తరచూ అలసటగా.. నీరసంగా అనిపిస్తుందా?.. అయితే ఈ బ్లడ్‌ టెస్ట్ కచ్చితంగా చేయించుకోండి


దిశ, ఫీచర్స్: తరచూ అలసట, నీరసం, కడుపు సమస్యలు, మలబద్దకంతో బాధపడుతున్నారా అయితే ఈ లక్షణాలన్నింటినీ లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది విటమిన్ల లోపానికి సంకేతం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి శరీరంలో తగినంత ప్రోటీన్, విటమిన్లు, వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. వీటిలో ఏదో ఒకటి లోపించినా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

*ఇక విటమిన్ ఎ, సి, ఇ మాదిరిగానే విటమిన్ బి-12 కూడా శరీరానికి చాలా ముఖ్యం. ఇది ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

*అలాగే విటమిన్ B12 ఎర్ర రక్త కణాలను సృష్టించడానికి, మెదడు పనితీరును పెంచడానికి చాలా అవసరం. *నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్-బి12 శరీరానికి చాలా అవసరమైన మూలకం. దీని లోపం శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో విటమిన్ బి12 లోపిస్తే తక్కువ మొత్తంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది.

*దీంతో చర్మం రంగు పాలిపోవడం ప్రారంభమవుతుంది. దీనికితోడు అలసట, మైకం, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

*శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తితే తలనొప్పి, మైగ్రేన్ సమస్యను పెంచుతుంది.

*అలాగే శ్వాస సమస్యలు, మానసిక బలహీనత వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. నాలుక వాపు, నోటిలో పొక్కులు వంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ కావాలి.

* విటమిన్ బి12 లోపం వల్ల కడుపు సమస్యలు కూడా వస్తాయి. ఈ విటమిన్ సరైన మొత్తంలో లేకపోతే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు.

*చేతులు, పాదాలు, కండరాలలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-బి12 పరీక్ష వెంటనే చేయించుకోవాలి.

*అలాగే ఈ విటమిన్‌ లోపాన్ని భర్తీ చేయడానికి కొవ్వు చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, పాలకూర వంటి వివిధ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.



Source link

Related posts

మనం ఉపయోగించే పసుపు నిజమైనదేనా..?.. ఈ ట్రిక్‌తో ఈజీగా తెలుసుకోవచ్చు!

Oknews

వసంత పంచమి రోజున సరస్వతి దేవి చిత్రపటాన్ని ఏ దిశలో పెట్టాలో తెలుసా..

Oknews

దిండు వేసుకునా లేక దిండు లేకుండా పడుకుంటే లాభాలా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Oknews

Leave a Comment