Health Care

తిన్న వెంటనే ఈ ఒక్క పని చేయండి.. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీరే చూడండి!


దిశ,ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడంతోపాటు అందుకు తగిన ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ముఖ్యం. అందుకే చాలామంది ఉదయం లేదా సాయంత్రం వ్యాయామాలు చేస్తుంటారు. ఇది అవసరమే కానీ భోజనం చేసిన వెంటనే మీరు ఈ ఒక్కపని చేయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ పనేంటో అనుకుంటున్నారా? జస్ట్ తిన్న తర్వాత వాకింగ్ చేయడమే. అయితే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

కార్డియో వాస్క్యులర్ హెల్త్

మధ్యాహ్నం లేదా రాత్రిపూట ఎప్పుడైనా కావచ్చు భోజనం చేసిన వెంటనే కాసేపు నడవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల శరీరంలో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, ఆరోగ్యానికి హానికరమైన చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయని చెప్తున్నారు. ఫలితంగా టోటల్ కార్డియో వాస్క్యులర్ హెల్త్ బాగు పడుతుంది. శరీరంలో మెరుగైన రక్త ప్రసరణకు, గుండె పనితీరుకు దోహదం చేస్తుంది. గుండె జబ్బుల రిస్కును తగ్గిస్తుంది.

స్ట్రెస్ అండ్ యాంగ్జైటీస్

తిన్న తర్వాత వాకింగ్ చేయడంవల్ల బాడీలో నేచురల్ మూడ్ ఎలివేటర్స్ అయిన ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల స్ట్రెస్, యాంగ్జైటీస్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తు్న్నారు. నిజానికి ఒత్తిడి అనేది చాపకింద నీరులా చాలా మందిని వెంటాడుతుంది. చిన్న సమస్యే అనుకుంటాం. కానీ ఇది పరోక్షంగా ఇతర అనారోగ్యాలకు, సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి దానిని తగ్గించుకునే ప్రయత్నం చాలా ముఖ్యం. మెరుగైన జీవన నాణ్యతకు, మాసిక ఆరోగ్యానికి భోజనం తర్వాత నడక మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయ్

శరీరంలో రక్తం, ఆక్సిజన్ సరఫరాలో నరాలు కీలకపాత్ర వహిస్తాయి. అయితే తగిన ఫిజికల్ యాక్టివిటీస్ లేకుంటే మాత్రం అవి తగినంత యాక్టివ్‌గా పనిచేయవని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు భోజనం తర్వాత నడకవల్ల బాడీలో రక్తం, ఆక్సిజన్ ప్రసరణ తీరు మెరుగు పడుతుంది. ఫలితంగా ఎనర్జీ లెవల్స్ కూడా పెరుగుతాయి. మానసిక ఆనందం ఏర్పడుతుంది. రోజువారీ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటారు. కాబట్టి మెరుగైన ఆరోగ్యంతోపాటు ఎనర్జీ లెవల్స్ కోసం భోజనం తర్వాత నడక అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సిర్కాడియన్ రిథమ్ నియంత్రణ

నిజానికి వ్యక్తుల సిర్కాడియమ్ రిథమ్ నియంత్రణలో ఉండాలంటే క్వాలిటీ స్లీప్ చాలా ముఖ్యం. అయితే భోజనం తర్వాత నడక వల్ల కూడా ఇది సాధ్యం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాకింగ్ నాణ్యమైన నిద్రను తద్వారా అవసరమైన విశ్రాంతిని పొందేలా ప్రేరేపిస్తుంది. ఫలితంగా మెదడు నరాలు ఉత్తేజితం అవుతాయి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.

గట్ హెల్త్‌కు మంచిది

ఆఫ్టర్ లంచ్ లేదా ఆఫ్టర్ డిన్నర్ తర్వాత వాకింగ్ అనేది గట్ మైక్రోబయామ్‌ హెల్త్‌‌ను మెరుగు పరుస్తుంది. దీనివల్ల అజీర్తి, ప్రేగుల్లో ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. గట్ బ్యాక్టీరియా మధ్య వైవిధ్యాన్ని, శారీరక సమతుల్యతను ప్రోత్సహించడంవల్ల నడక టోటల్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి

భోజనం తర్వాత వాకింగ్ చేయడం షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిదని, దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. దీంతోపాటు అధిక బరువు, శరీరంలో కొవ్వు శాతం పెరుగుదల, హృదయ సంబంధ వ్యాధులు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి రాకుండా నివారించడంలో భోజనం తర్వాత నడక తనవంతు పాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. వాకింగ్ వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. మానసిక వికాసం ఏర్పడుతుంది.

*గమనిక :పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.



Source link

Related posts

పచ్చి టమాటాలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Oknews

కళ్లద్దాలతో బాధపడుతున్నారా! అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Oknews

ప్లే స్కూల్ ఫీజే రూ.4 లక్షలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ తండ్రి పోస్ట్!

Oknews

Leave a Comment