చిన్నారి లక్షితపై దాడి జరిగిన ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతను ట్రాప్ కెమెరాల్లో గుర్తించారు. నడక మార్గాల్లో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతల కదలికల్ని అధికారులు గుర్తించారు. ఆగష్టు 11న ఆరేళ్ల లక్షితపై చిరుత దాడి చేయడంతో చిరుతల్ని బంధించేందుకు టీటీడీ, అటవీశాఖ ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం గుర్తించిన అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి.