రానున్న రోజుల్లో రాష్ట్రంలో రైల్వేలను మరింత అభివృద్ధి చేస్తాం – కిషన్ రెడ్డి2014 -15లో రూ. 258 కోట్లుగా ఉన్న తెలంగాణ రైల్వే బడ్జెట్(Railway Budget) కేటాయింపులను కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 20 రెట్లు పెంచి 2024- 25 నాటికి రూ.5,070 కోట్లకు చేర్చడం తెలంగాణలో రైల్వే అభివృద్ధి మీద మోదీ ప్రభుత్వానికి నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) పేర్కొన్నారు. ఇంతవరకు ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్దిపేట లాంటి ప్రాంతాలకు కూడా కేంద్రం కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి తెచ్చిందని….ఆదాయపరంగా అనుకూలంగా కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమరవెల్లిలో నూతన రైల్వే హాల్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేషన్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఘనంగా నిర్వహించుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైల్వేలలో అపూర్వమైన రీతిలో అభివృద్ధి సాధించడానికి మరింతగా కృషి చేస్తామని రాష్ట్రంలో రైల్వే రూపు రేఖలను సమూలంగా మార్చివేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు.
Source link