కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్టీఎస్ ఈసెట్ -మే 6టీఎస్ ఎడ్‌సెట్ – మే 23 నటీఎస్ లా సెట్ – జూన్ 3టీఎస్‌పీజీ సెట్-జూన్ 6 నుంచి 9 వరకుటీఎస్ ఐసెట్- జూన్ 4, 5టీఎస్ పీఈసెట్- జూన్ 10 నుంచి 13 వరకుటీఎస్ పీజీఈసెట్-జూన్ 6 నుంచి 8 వరకురాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ ఐసెట్(TS ICET-2024) ఎంట్రెన్స్ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. టీఎస్ ఐసెట్ ను కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. లా కాలేజీల్లో 3, 5 ఏళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ లా సెట్(TS Law CET-2024) నిర్వహించనున్నారు. ఈ పరీక్షను జూన్ 3న నిర్వహించనున్నారు. పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎల్ఎల్ఎం(LLM) ప్రవేశ పరీక్షను జూన్ 3న నిర్వహించనున్నారు. ఈ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. బీపీఎడ్(B.PEd), డీపీఎడ్(D.PEd) కోర్సుల్లో ప్రవేశాలకు టీఎస్ పీఈసెట్(TS PECET) పరీక్షను జూన్ 10 నుంచి 13 మధ్య నిర్వహించనున్నారు. ఈ పరీక్షను శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్టీయూ హైదరాబాద్ టీఎస్ పీజీఈసెట్(TS PGECET-2024) పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించనుంది.
Source link
previous post