Latest NewsTelangana

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు


Telangana Congress Rajyasabha Members: కాంగ్రెస్ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. ఈయన ప్రస్తుతం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ విషయంలో అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటలో అనిల్ కు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అలాగే, అటు కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ.చంద్రశేఖర్, అజయ్ మాకెన్.. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 (గురువారం) వరకూ అవకాశం ఉండడంతో వీరంతా గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Also Read: BRS Mlas: మీడియా పాయింట్ వద్దకు నో ఎంట్రీ – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం

మరిన్ని చూడండి





Source link

Related posts

Anchor Rashmi in beautiful look బుట్టబొమ్మలా మారిన యాంకర్ రష్మీ

Oknews

DSP Praneet Rao Arrest: పోలీసుల అదుపులో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు… నిఘా ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపణలు

Oknews

Singareni Jobs 2024 : సింగరేణి నుంచి మరో నోటిఫికేషన్ – 327 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు

Oknews

Leave a Comment