Latest NewsTelangana

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు


Telangana Congress Rajyasabha Members: కాంగ్రెస్ తరఫున తెలంగాణ (Telangana Congress) నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రేణుకాచౌదరి (Renuka Chowdary), అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. ఈయన ప్రస్తుతం సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యసభ విషయంలో అనూహ్యంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటలో అనిల్ కు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం రెండు రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. అలాగే, అటు కర్ణాటకలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల నుంచి సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ.చంద్రశేఖర్, అజయ్ మాకెన్.. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పోటీ చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 15 (గురువారం) వరకూ అవకాశం ఉండడంతో వీరంతా గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఫైర్ బ్రాండ్@ రేణుకా చౌదరి

రేణుకాచౌదరి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. 1986 నుంచి 98 వరకూ రెండుసార్లు రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 1999, 2004లో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. హెచ్ డీ దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, 2006 నుంచి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేసి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. సీనియర్ నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆమెకు ఏఐసీసీ అధిష్టానం రాజ్యసభ అవకాశమిచ్చింది.

యువ నాయకుడిగా అనిల్ గుర్తింపు

సికింద్రాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు యత్నించారు. అయితే, పార్టీలో వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములా అమలుతో ఆ సీటును తండ్రి కోసం త్యాగం చేశారు. యూత్ కాంగ్రెస్ లో చురుగ్గా పని చేసి మంచి గుర్తింపు పొందడంతో రాజ్యసభ ఛాన్స్ దక్కింది.

ఏపీలో ఎన్నిక ఏకగ్రీవమే

అటు, ఏపీలో రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకొంది. అభ్యర్థిని నిలబెట్టే ఆలోచన లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. దీంతో వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. గురువారంతో నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఈ నెల 27న ఆ పార్టీ అభ్యర్థులు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: BRS Mlas: మీడియా పాయింట్ వద్దకు నో ఎంట్రీ – బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం

మరిన్ని చూడండి





Source link

Related posts

TDP-Janasena Second Phase Candidate List..? టీడీపీ-జనసేన సెకండ్ లిస్ట్ ?

Oknews

Temperature Rises in AP Telangana Weather Report for Next 4 days IMD

Oknews

TS Inter Hall Ticket 2024 : తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు

Oknews

Leave a Comment