Telangana

తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేశారా..? ఇవాళే లాస్ట్ డేట్, ప్రాసెస్ ఇదే-telangana tet applications 2024 ends today application direct link are here ,తెలంగాణ న్యూస్



How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండిటెట్ రాసే అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.ముందుగా ‘Fee Payment’ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.పేమెంట్ స్టెటస్ అనే కాలమ్ పై నొక్కి దరఖాస్తు రుసుం చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిందా..? లేదా అనేది చెక్ చేసుకోవాలి.ఆ తర్వాత ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.అన్ని వివరాలను ఎంట్రీ చేశాక చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.’Print Application’ అనే ఆప్షన్ పై నొక్కితే మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు.రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.ఆసక్తి అంతంతే…!గతంతో పోల్చితే…ఈసారి తెలంగాణ టెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపించటం లేదు. గతేడాది నిర్వహించిన టెట్ పరీక్షకు…. 2,91,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేప‌ర్ -1కు 82,560 ద‌ర‌ఖాస్తులు, పేప‌ర్- 2కు 21,501 ద‌ర‌ఖాస్తులు రాగా…. ఈ రెండు పేప‌ర్ల‌కు క‌లిపి 1,86,997 మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తేడాది నిర్వ‌హించిన టెట్‌కు మొత్తంగా చూస్తే….. 3.79 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. అయితే ఈసారి నిర్వహించబోయే టెట్ కు ఈస్థాయిలో దరఖాస్తులు వచ్చే పరిస్థితులు కనిపించటం లేదు. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించి… ఏప్రిల్ 9వ తేదీ నాటికి 1.90 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇవాళే చివరి తేదీ కావటంతో…. 2 లక్షల లోపే అప్లికేషన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.మొత్తంగా చూస్తే గతేడాది వచ్చిన దరఖాస్తుల సంఖ్య దాటడం కష్టమే..!



Source link

Related posts

Telangana: తెలంగాణలో ఇంకా రజాకార్ల పాలన కొనసాగుతోంది: అసోం సీఏం సంచలన వ్యాఖ్యలు

Oknews

Kadem Project Latest Work Updates

Oknews

minister komatireddy venkatareddy sensaiona comments on brs chief kcr in nalgonda | Minister Komatireddy: ‘కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండ వస్తారు?’

Oknews

Leave a Comment