స్కూళ్లకు 13 రోజుల సెలవులు
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో సెలవులు ఉంటాయని అధికారులు తెలిపారు. బతుకమ్మ పండుగ ప్రారంభం రోజున అంటే అక్టోబర్ 14న సాధారణ సెలవు ప్రకటించింది. అక్టోబర్ 22న దుర్గాష్టమి రోజున ఆప్షనల్ సెలవు ఇచ్చింది. దసరా పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు ఏడు రోజుల దసరా సెలవులు ప్రకటించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు ఉంటాయి. 26వ తేదీన కాలేజీలు తిరిగి తెరచుకోనున్నాయి. దసరా సెలవుల్లో జూనియర్ కాలేజీలకు ఎలాంటి స్పెషల్ క్లాసులు నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు పేర్కొంది.