పోస్టుల వివరాలు ఇలాఇందులో ప్రొఫెసర్ పోస్టులు 498, అసోసియేట్ ప్రొఫెసర్ 786, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1,459, ట్యూటర్లు 412, బోధనా సిబ్బంది 1,201 పోస్టులను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narasimha) ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల బలోపేతం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రతి సంవత్సరం 634 కోట్ల 48 లక్షల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6,958 స్టాప్ నర్సుల (Staff Nurse Jobs)నియామకాల్లో భాగంగా మెడికల్ కాలేజీల్లో నియమకాలు చేపట్టామన్నారు. వైద్య కళాశాలలకు అనువైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన వైద్య విద్యను రాష్ట్రంలో అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సాహసపేతమైన నిర్ణయం వల్ల చేపట్టిన నియామకాల ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో ప్రధానంగా ఆధార్ బేస్డ్ అటెండెన్స్ మానిటరింగ్ సమస్యను అధిగమించబోతున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు.
Source link