తెలుగు తమ్ములు చూపు ఎటువైపు?రాష్ట్రంలో టీడీపీ(TDP) ఉనికి పెద్దగా లేకపోయినప్పటికీ….కొన్ని చోట్ల పార్టీకి చెప్పుకోదగిన కేడర్, సానుభూతిపరులు ఉన్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక, మొన్నటి శాసనసభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. కాగా టీడీపీ మద్దతుదారుల ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. కొన్ని చోట్ల ఏకంగా టీడీపీ జెండా పట్టుకుని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారం సైతం చేశారు. అయితే తెలుగు తమ్ములు మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ఉన్నారని టాక్ వినిపించింది. అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Elections) ఈసారి కూడా తెలుగు తమ్ములు హస్తం పార్టీకే మద్దతు ఇస్తారా? లేక ఏపీలో పొత్తు కుదుర్చుకున్న బీజేపీ వైపు నిలుస్తారా? అనేది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ (TS Politics)లో ఆసక్తిగా మారింది.
Source link