Health Care

తెలివైన దొంగ, తెలివి తక్కువ మనిషి.. యువతి ఛీటింగ్‌కు ప్రియుడు షాక్


దిశ, ఫీచర్ : టీనేజ్ ఏజ్ వచ్చాక యువతీయువకులు ప్రేమించుకోవడం కామన్ అయిపోయింది. గతంలో ఒక్కరితోనే సరిపెట్టునే యూత్.. ప్రస్తుతం ఒక లవర్ ఉండగానే మరో అమ్మాయితో ఎఫైర్ స్టార్ట్ చేయడం.. ఒక ప్రియుడు ఉండగానే మరో ఇద్దరి యువకులను లైన్‌లో పెట్టే అమ్మాయిలు ఉంటున్నారు ఈ జనరేషన్‌లో. మరీ ముఖ్యంగా అమ్మాయిలు లవ్ పేరిట ఛీటింగ్ చేయడం పెరిగిపోయింది ఈ మధ్య. తాజాగా నెట్టింట ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. తన లవర్ పక్కన ఉండగానే మరో అమ్మాయికి ఫోన్ నంబర్ ఇవ్వడానికి ప్రయత్నించి మోసపోయిన ప్రియుడిని చూసి నెటిజన్లు నవ్వులు చిందిస్తున్నారు.

ఇంతకూ ఆ వీడియోలో ఏం ఉందంటే.. ఓ లవర్స్ జంట లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తుంది. ఓ స్టేషన్‌లో ట్రైన్ ఆగింది. ఆ సమయంలో ఓ యువతి వచ్చి వారి పక్కన్నే కూర్చుంది. అదే సమయంలో యువకుడి గర్ల్ ఫ్రెండ్ కిందికి వంగి షూ లేస్ కట్టుకుంటుంది. ఈ గ్యాప్‌లోనే అప్పుడే వచ్చి కూర్చున్న యువతి నీ ఫోన్ నంబర్ ఇవ్వమని యువకుడికి సైగ చేస్తుంది. కొత్త ఫిగర్ దొరికిందన్న ఉత్సాహంతో ఆ యువకుడు నీ నంబర్ డయల్ చేసి ఇవ్వమని ఏకంగా మొబైల్‌నే ఇస్తాడు. అదే అదునుగా భావించిన యువతి అతడి ఫోన్ తీసుకోని ట్రైన్ దిగి వెళ్లిపోతుంది. షాక్ తిన్న యువకుడు విషయాన్ని ప్రియురాలికి చెప్పలేక.. అటు ఫోన్ పోయి అయోమయంలో పడిపోయాడు.

ఈ ఫన్నీ వీడియోని చూసిన నెటిజన్లు నవ్వులు చిందిస్తూ ‘‘వావ్ అతను ఏమీ చెప్పలేడు.. ఆ దొంగను ఫోన్‌తో వెళ్ళనివ్వాలి’’ ‘‘ తెలివైన దొంగ, తెలివితక్కువ మనిషి’’ ‘‘అతను ఫోన్‌కు పాస్‌‌వర్డ్ ఉంటే ఆమె జోకర్ అయినట్టే..’’ ‘‘ఇదంతా ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి వేసిన ప్లాన్’’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియోను 25 మినియన్ల మంది వీక్షించగా.. 84 వేల మంది లైక్ కొట్టారు.





Source link

Related posts

వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించే పానీయాలు ఇవే..

Oknews

టీ షర్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?.. ఈ స్టోరీ వింటే..

Oknews

ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా.. ఈ ఆసనంతో సమస్యలన్నీ పరార్

Oknews

Leave a Comment