Top Stories

తెలుగులో లియో రిలీజ్ అవుతుందా..?


విజయ్ హీరోగా నటించిన లియో సినిమాను తెలుగులో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే విడుదలకు సరిగ్గా 2 రోజుల ముందు ఈ సినిమాపై కోర్టు కేసు పడింది. ఆ సినిమా టైటిల్ తమదంటూ ఓ కంపెనీ, కోర్టును ఆశ్రయించింది. దీంతో లియో సినిమా సకాలంలో థియేటర్లలోకి రాదనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

"తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది."

ఇలా లియో విడుదలపై పూర్తి స్పష్టత ఇచ్చాడు నాగవంశీ. 19వ తేదీన మార్నింగ్ షోలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని, ఆల్రెడీ సంప్రదింపులు మొదలుపెట్టామని తెలిపాడు.

"లియో తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటాం."

దర్శకుడు లోకేష్ కనగరాజ్ నిరాశపరచడనే ఉద్దేశంతోనే లియో తెలుగు రైట్స్ తీసుకున్నామని తెలిపాడు నాగవంశీ. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు పోటీగా దసరా బరిలో నిలిచింది లియో.



Source link

Related posts

పాముకు కోర‌ల్లో విషం.. ష‌ర్మిల‌కు నిలువెల్లా!

Oknews

రిపబ్లిక్ డే కానుకగా సీనియర్ హీరో సినిమా

Oknews

బీజేపీ జాబితాలో జ‌న‌సేన‌కు చోటు వుంటుందా?

Oknews

Leave a Comment