EntertainmentLatest News

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రేమలు సరికొత్త రికార్డు 


లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా సినిమా గొప్పదని చెప్పే చిత్రాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. అలా వచ్చిన ఒక చిత్రమే ప్రేమలు. మలయాళ భాషకి చెందిన ఈ మూవీ మార్చి 8  న తెలుగులోకి డబ్ అయ్యి సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ సాధించిన  ఒక రికార్డు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

  

ప్రేమలు ఇప్పటి వరకు 10.54 కోట్ల రూపాయల గ్రాస్ ని  రాబట్టింది.ఇది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు.ఎందుకంటే ఇప్పటివరకు  తెలుగులో విడుదలైన అన్ని మలయాళ సినిమాల  కంటే ప్రేమలు కే 

ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ కలెక్షన్స్ తో ప్రేమలు మున్ముందు ఇంకెన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.అలాగే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో కథ రూపుదిద్దుకోవడం ప్రేమలు కి ప్లస్ అయ్యింది. 

ఇక  మలయాళ ప్రేక్షకులు ఎలా అయితే  మమిత బైజు,నస్లీన్ నటనకి బ్రహ్మ రధం పట్టారో  తెలుగు ప్రేక్షకులు కూడా అదే విధంగా బ్రహ్మ రధం పడుతున్నారు. శ్యామ్ మోహన్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్ సంగీత్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.  విష్ణు విజయ్ సంగీతాన్ని అందించగా గిరి దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేసాడు.



Source link

Related posts

నాగ్ సర్ మీకు థ్యాంక్యూ…

Oknews

Mother Suicide with her children due to family disputes in Mahabubabad district | Mahabubabad District: ఇద్దరు ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు

Oknews

ఎవరీ ప్రణీత్ హనుమంతు.. అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినీ పరిశ్రమతో సంబంధమేంటి?

Oknews

Leave a Comment