నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ నుంచి గత సంవత్సరం దసరా కానుకగా అక్టోబర్ 19 న వచ్చిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో బాలయ్య ప్రదర్శించిన వన్ మాన్ షో కి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ దద్దరిల్లాయి. విడుదలైన అన్ని చోట్ల కూడా విజయదుంధుబి మోగించిన భగవంత్ కేసరి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని తెలుగు ప్రజలకి చెప్తుంది.
భగవంత్ కేసరి ఈ నెల 28న ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగులో ప్రసారం కాబోతుంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకి తమ ఛానల్ లో భగవంత్ కేసరి ప్రసారం కాబోతుందని ఛానల్ యాజమాన్యం సగర్వంగా ప్రకటించింది. తమ ఛానల్ తో పాటు సోషల్ మీడియా ద్వారా జీ యాజమాన్యం ఈ విషయాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తుంది. వరల్డ్ టెలివిజన్ బిగ్గెస్ట్ ప్రీమియర్ గా రాబోతున్న భగవంత్ కేసరి బిగ్ స్క్రీన్ అండ్ ఓటిటి లో సూపర్ రెస్పాన్స్ ని అందుకుంది. దీంతో శాటిలైట్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ని అందుకోవడం ఖాయం. బాలయ్య ఫ్యాన్స్ అయితే భగవంత్ రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్ ని కూడా పొందటం గ్యారంటీ అని అంటున్నారు.
బాలకృష్ణ తో పాటు కాజల్, శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ నటించిన భగవంత్ కేసరికి అనిల్ రావిపూడి దర్శకుడు కాగా షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు నిర్మించారు. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ సాధించిన సినిమాగా కూడా భగవంత్ కేసరి నిలిచింది.