Andhra Pradesh

తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, రాబోయే మూడు రోజులు వర్షాలు-ap tg rains alert weather report next three days moderate to heavy rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంపై సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 కి.మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని పేర్కొంది. అలాగే రాయలసీమ, పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 4.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది. రేపు(గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.



Source link

Related posts

Opinion: ఏ నమూనాతో బాబు ఏలుతాడో?

Oknews

Tirupathi Minor Girl: తిరుపతి జిల్లాలో ఘోరం, మైనర్‌ బాలికను అపహరించి.. హత్య చేసిన బీహార్‌ కూలీ

Oknews

APCM Chandrababu Oath: చంద్రబాబు నాయుడు అనే నేను.. దైవ సాక్షిగా చంద్రబాబు ప్రమాణం

Oknews

Leave a Comment