అదేంటో గాని మృణాల్ ఠాకూర్ (mrunal thakur) ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది.ఇంతకీ ఆమె ఏం అనుకుందో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవ్వడం గ్యారంటీ. ఇక తెలుగు సినిమాల్లో నటించకూడదని అనుకుంది.ఇది నిజం.పైగా ఇక నటించకూడదని ఏడ్చింది కూడా. కానీ ఇప్పుడు వరుసపెట్టి చాలా పెద్ద సినిమాలనే చేస్తుంది. మరి అసలు విషయం ఏంటో చూద్దాం
మృణాల్ ఠాకూర్ ఇటీవలే హాయ్ నాన్న తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విజయంలో ఆమె పాత్ర ఉందనేది వాస్తవం. ఈ విషయాన్ని అందరు ఒప్పుకుంటారు. ఇప్పుడిప్పుడే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడుతుంది. ఆమె తాజా మూవీ ఫ్యామిలీ స్టార్ (family star) ఏప్రిల్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. వాటిల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మృణాల్ కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. సీతారామం షూటింగ్ సమయంలో తెలుగులో డైలాగులు చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఏడ్చేదాన్ని కూడా. తెలుగు డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేసే దాన్ని. ఒక సందర్భంలో అసలు ఇక తెలుగు సినిమాలు చెయ్యకూడదని కూడా నిర్ణయించుకున్నానని చెప్పింది. మృణాల్ చెప్పిన ఈ మాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి.
ఇక్కడో ఇంకో విషయం ఏంటంటే మృణాల్ తననుకున్న విషయం మొత్తాన్ని హీరో దుల్కర్ సల్మాన్ తో చెప్పింది కాకపోతే దుల్కన్ మాత్రం సీతారామం తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు వస్తాయని చె ప్పాడు. ఆయన చెప్పినట్టుగా జరిగింది. అన్నట్టు మృణాల్ ఇప్పుడు తెలుగులో డైలాగ్ లని చెప్పగలదు.ఎలాంటి భయం కూడా లేదు. సీతారామం, హాయ్ నాన్న తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మృణాల్ ఫ్యామిలీ స్టార్ తో ఇంకెంతగా మెస్మరైజ్ చెయ్యబోతుందో చూడాలి.