EntertainmentLatest News

త్రిగుణ్, శ్రీజిత ఘోష్ కాంబోలో ‘స్వీటీ నాటీ క్రేజీ’ లాంచ‌నంగా ప్రారంభం


త్రిగుణ్, శ్రీజిత ఘోష్ కాంబోలో అరుణ్ విజువల్స్ బ్యానర్ మీద ఆర్. అరుణ్ నిర్మిస్తున్న చిత్రం ‘స్వీటీ నాటీ క్రేజీ’. ఈ మూవీకి రాజశేఖర్.జి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

త్రిగుణ్, శ్రీజిత ఘెష్, ఇనయ, రాధ, అలీ, రఘుబాబు, రవి మరియ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నేడు ప్రారంభించారు.  ముహూర్తపు సన్నివేశానికి అలీ క్లాప్ కొట్టగా.. దామోదర ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. బెక్కెం వేణు గోపాల్ గారు దర్శకత్వం వహించారు. 

అనంతరం మీడియాతో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. “అరుణ్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరుణ్ విజువల్స్ మీద రాజశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీజిత, ఇనయ లకు ఇందులో మంచి పాత్రలుంటాయి. టైటిల్‌కు తగ్గట్టుగా.. స్వీటీ, నాటీ, క్రేజీలా ఉంటాయి. నాకు ఇంత వరకు కామెడీ చిత్రాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ‘కథ’తో మొదలైన నా ప్రయాణానికి మీడియా వారు సపోర్ట్ అందించారు” అని అన్నారు.

న‌టుడు రఘుబాబు మాట్లాడుతూ.. “త్రిగుణ్ ద్విభాష చిత్రంగా ఈ మూవీని చేస్తున్నారు. తెలుగులో నేను నటిస్తున్నాను. తమిళంలో నా పాత్రను రవి మరియ గారు చేస్తున్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాను” అని అన్నారు.

న‌టుడు రవి మరియ మాట్లాడుతూ.. “తమిళంలో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. దర్శకత్వం వహించాను. ఖుషీ, నాని చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో నేను ఓ మంచి పాత్రను పోషిస్తున్నాను.” అని అన్నారు.

హీరోయిన్ ఇనయ మాట్లాడుతూ.. “నాకు తెలుగు అంతగా రాదు. ఈ సినిమా అయ్యేలోపు నేర్చుకుంటాను. ఇది నాకు 45వ సినిమా. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టాను. ఇందులో నేను నందిని అనే మంచి పాత్రను చేస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది” అన్నారు.

హీరోయిన్ రాధ మాట్లాడుతూ.. “నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇనియతో నేను తమిళంలో చేశాను. త్రిగుణ్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఇది నాకు రీ ఎంట్రీలా అనిపిస్తోంది. మా సినిమాను అందరూ ఆదరించండి” అని అన్నారు.

హీరోయిన్ శ్రీజిత ఘోష్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలో నటిస్తుండటం మొదటి సారి. ఓ నటిగా అన్ని రకాల పాత్రలను, సినిమాలను చేయాలని ఈ చిత్రాన్ని ఎంచుకున్నాను. ఇది చాలా మంచి చిత్రం అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు.

సినిమాటోగ్రఫర్ విజయశ్రీ మాట్లాడుతూ.. “ఇప్పుడున్న టెన్షన్ జీవితాలకు పూర్తిగా నవ్వించే చిత్రం అవుతుంది. అందరూ హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది” అని అన్నారు.

నిర్మాత అరుణ్ మాట్లాడుతూ.. “మా సినిమా పూర్తి ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ.. “సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. అందరినీ నవ్వించేలా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కామెడీ యాంగిల్‌లో సినిమా ఉంటుంది” అని అన్నారు.



Source link

Related posts

ఆయన ధనుష్ అన్నయ్యే.. ఎప్పుడు అనుకోలేదంటున్న ధనుష్ 

Oknews

Eagle Hindi Performance ఈగల్ హిందీ పెరఫార్మెన్స్

Oknews

Ramagundam Fertilizers and Chemicals Limited has released notification for the recruitment of Engineer Senior Chemist Accounts Officer Medical Officer Posts

Oknews

Leave a Comment