Health Care

థైరాయిడ్ పెషేంట్స్ ఈ ఫుడ్ తింటున్నారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?


దిశ, ఫీచర్స్: ‘ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్ర లేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేక పోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి హైపర్ థైరాయిడ్ లక్షణాలు’.

హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్లు అవసరమైన వాటికంటే అధికంగా ఉత్వత్తి అయ్యే పరిస్థితిని హైపర్ థైరాయిజం అంటారు. ప్రస్తుత రోజుల్లో థైరాయిడ్ తో బాధ పడుతోన్న వారి సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. కాగా హైపర్ థైరాయిడ్ సమస్యతో బాధపడుతోన్న వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉంటే మేలని.. ఈ ఫుడ్ తీసుకున్నట్లైతే సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశముందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ ఉన్నవారు ఏ ఏ ఆహారాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ధాన్యాలు: హైపర్ థైరాయిడ్ ఉన్నవారు ధాన్యాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో గోయిట్రోజెన్ ఉంటుంది. ధాన్యాలు అధికంగా తిన్నట్లైతే థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.

బ్రోకలీ: బ్రోకలీ కూరతో బోలెడన్నీ ప్రయోజనాలున్నప్పటికీ థైరాయిడ్ పెషేంట్స్ కు మాత్రం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. కాగా థైరాయిడ్ ఉన్నవారు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, వంటివి ఎక్కువగా తినకూడదు.

బంగాళదుంప చిప్స్: చిన్న నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే చిప్స్ థైరాయిడ్ పెషెంట్స్ తినకూడదు. బంగాళదుంప చిప్స్, కుకీలు, కేక్స్ వంటివి థైరాయిడ్ ఉన్నవారికి నష్టం కలిగించడమే కాకుండా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి.

డ్రై ఫ్రూట్స్: థైరాయిడ్ తో ఉన్నవాళ్లు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినకూడదు. ఈ గింజల్లో గోయిట్రోజెన్ అని పిలువబడే సమ్మేళనం ఉంటుంది. కాగా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి.

అవిసె గింజలు: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసె గింజలు థైరాయిడ్ ఉన్నవారు కనుక తింటే సమస్య మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజల్లో కూడా గోయిట్రోజెన్ ఉంటుంది. కాగా థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది.



Source link

Related posts

చీరలో సన్నగా, అందంగా కనిపించాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి

Oknews

నైట్రోజన్‌తో మరణశిక్ష.. ప్రపంచంలోనే తొలిసారి.. ఎక్కడో తెలుసా?

Oknews

కదిలే ఇసుక తిన్నెలు చూశారా? .. వీటి ప్రత్యేకత ఏంటంటే..

Oknews

Leave a Comment