EntertainmentLatest News

దర్శకుడి విషయంలో జాగ్రత్త పడుతున్న చిరంజీవి


భోళాశంకర్ ప్లాప్ తర్వాత  కథ, దర్శకుడి ఎంపిక లో చిరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. నో రికమండేషన్స్.నో కాంప్రమైజ్ తనకి పక్కాగా కథ, దర్శకుడు నచ్చితేనే కమిట్ అవుతున్నాడు. విశ్వంభర  కూడా ఆ కోవకి చెందిన మూవీనే.  వాస్తవానికి ఆ ప్లేస్ లో వేరే డైరెక్టర్ మూవీ ఉండాల్సింది. ఇక  ఆఫ్టర్ విశ్వంభర చిరుతో మూవీ చెయ్యటానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు. 

చిరు ప్రస్తుతం విశ్వంభర.షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి వశిష్ట  దర్శకుడు.ఈ మూవీ తర్వాత చిరు ఎవరి దర్శకత్వంలో మూవీ చేస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. హరీష్ శంకర్ చిరు కి ఒక కథ చెప్పాడని  దాదాపుగా ఓకే  అయిపోయిందనే వార్తలు వస్తున్నాయి.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సినిమాని రూపొందిస్తుందని కూడా అంటున్నారు.కాకపోతే  ఫైనల్ మాత్రం అవ్వలేదు.  తమిళ దర్శకుడు హరి కూడా మెగాస్టార్ కి  ఒక కథ చెప్పేందుకు  ప్రయత్నిస్తున్నట్టు గా తెలుస్తుంది. ఈయన గతంలో సూర్య తో సింగం సిరీస్  తెరకెక్కించాడు.  అయితే ఓవర్ మాస్ ఎలిమెంట్స్ తో హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేసే హరిని  చిరు ఎంత వరకు ఒకే చేస్తాడో  తెలియదు.ఇంకా చెప్పాలంటే  అలాంటి సినిమాలకి బాస్  కొంచం దూరంగానే ఉంటాడు. ఏది ఏమైనా హరి చెప్పే కథని బట్టే ఆధారపడి ఉంటుంది. 

ఇక సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్  కల్యాణ కృష్ణ కూడా లైన్ లో ఉన్నాడు. అనిల్ రావిపూడి కూడా ఆల్రెడీ  చిరు కి కథ చెప్పాడు కూడా.  డబుల్ ఇస్మార్ట్ తో హిట్టు కొట్టి అన్నయ్య  దగ్గరికి వెళ్లే ప్లాన్ లో పూరి జగన్నాధ్ కూడా ఉన్నాడు.ప్రస్థుతానికి అయితే చిరు ఎవరికి కమిట్ అవ్వలేదు. ఎవరికి గ్రీన్ సిగ్నల్ఇస్తాడో కొన్ని రోజులు అయితే గాని తెలియదు. మెగా స్టార్ ప్రస్తుతానికి తన ధ్యాస మొత్తాన్ని  విశ్వంభర మీద పెట్టాడు. ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టి తన ఫ్యాన్స్ కి గిఫ్ట్ అవ్వాలనే కసితో ఉన్నాడు. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10 న విశ్వంభర విడుదల కానుంది.

 



Source link

Related posts

గేమ్ చేంజర్ టీజర్ డేట్ ఫిక్స్.. మెగా అభిమానులు బి రెడీ !

Oknews

వైసీపీ నేతలకి చుక్కలు చూపిస్తున్నారు

Oknews

రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారంలోకి వచ్చింది లంకె బిందెల కోసమా..? : KTR

Oknews

Leave a Comment