దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. మినిమమ్ వర్క్ అవుట్ మస్ట్ అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. కానీ జనాల్లో మాత్రం మార్పు రాలేదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ఇండియన్స్ సగానికి సగం మంది అంటే ప్రతి ఇద్దరికి ఒకరు కూడా అచీవ్ చేయలేకపోయారని గుర్తించింది. 2030 నాటికి భారతదేశంలో సిఫార్సు చేయబడిన శారీరక శ్రమ స్థాయిని అందుకోని వారి నిష్పత్తి 59.9%కి చేరుతుందని అంచనా వేయబడింది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, చిత్తవైకల్యం, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాయామం చేయని వారి నిష్పత్తి 31%గా ఉండగా.. భారతదేశంలో 49.4%, పాకిస్తాన్‌లో 45.7%. భూటాన్‌లో 9.9% నేపాల్‌లో 8.2% ఉంది. అధిక ఆదాయం కలిగిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వర్క్ ఔట్ చేయని వారు 48% ఉండగా.. దక్షిణాసియాలో 45% ఉన్నారు. ఇక 2010 నుంచి 2022 మధ్యకాలంలోనే వ్యాయామం ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగినా.. దాన్ని ఫాలో అవడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. దీంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే వారి సంఖ్య
ఐదు శాతం తగ్గింది.ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. మినిమమ్ వర్క్ అవుట్ మస్ట్ అని నిపుణులు కూడా సూచిస్తున్నారు. కానీ జనాల్లో మాత్రం మార్పు రాలేదని మెడికల్ జర్నల్ ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్‌లో ప్రచురించబడిన అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా ఇండియన్స్ సగానికి సగం మంది అంటే ప్రతి ఇద్దరికి ఒకరు కూడా అచీవ్ చేయలేకపోయారని గుర్తించింది. 2030 నాటికి భారతదేశంలో సిఫార్సు చేయబడిన శారీరక శ్రమ స్థాయిని అందుకోని వారి నిష్పత్తి 59.9%కి చేరుతుందని అంచనా వేయబడింది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే గుండెపోటు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్, చిత్తవైకల్యం, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాయామం చేయని వారి నిష్పత్తి 31%గా ఉండగా.. భారతదేశంలో 49.4%, పాకిస్తాన్‌లో 45.7%. భూటాన్‌లో 9.9% నేపాల్‌లో 8.2% ఉంది. అధిక ఆదాయం కలిగిన ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వర్క్ ఔట్ చేయని వారు 48% ఉండగా.. దక్షిణాసియాలో 45% ఉన్నారు. ఇక 2010 నుంచి 2022 మధ్యకాలంలోనే వ్యాయామం ప్రాధాన్యత గురించి అవగాహన పెరిగినా.. దాన్ని ఫాలో అవడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారు. దీంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే వారి సంఖ్య ఐదు శాతం తగ్గింది.