నందమూరి బాలకృష్ణ అండ్ దిల్ రాజు.. ఈ రెండు పేర్లు పక్కన పక్కన ఉంటేనే సినీ అభిమానుల్లో ఒక వైబ్రేషన్ కలుగుతుంది కదు. మరి ఈ ఇద్దరి కాంబోలో మూవీ వస్తే. తెలుగు ప్రేక్షకులంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. అందుకు ముహూర్తం కుదరబోతుందనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో శరవేగంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం మరి
2003 లో నితిన్ హీరోగా వచ్చిన దిల్ నుంచి దాదాపుగా అందరి స్టార్ హీరోస్ తోను దిల్ రాజు సినిమాలు చేసారు.కానీ బాలయ్య తో మాత్రం సెట్ కాలేదు. నిజానికి గతంలో దిల్ రాజు చాలా సార్లు బాలయ్య తో సినిమా చెయ్యాలని ప్రయత్నించినా అవి కార్యరూపం దాల్చలేదు. కానీ ఈ సారి పక్కా అని దిల్ రాజు సన్నిహిత వర్గాలు అంటున్నాయి బాలకృష్ణ చిన్న కూతురు పేరు తేజస్విని. ఈమె గత రెండేళ్లుగా బాలయ్య కి సంబంధించిన పనుల్ని వ్యక్తిగతంగా చూసుకుంటు ఉంది. అంటే ఎవరైనా బాలయ్య కోసం కథ రెడీ చేసుకుంటే వింటుంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఒక యువ దర్శకుడి ని తేజశ్వని వద్దకు తీసుకెళ్లాడని ఆ డైరెక్టర్ తేజశ్వని కి పూర్తి నారేషన్ ఇచ్చాడని ఆమెకి నచ్చిందనే వార్తలు వస్తున్నాయి. మరొకొన్ని రోజుల్లో బాలయ్య కూడా స్క్రిప్ట్ వింటారని కూడా చెప్తున్నారు.
ఇప్పుడు ఈ ఈ వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్ష మవ్వడంతో బాలయ్య ఫ్యాన్స్ అయితే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఆ డైరెక్టర్ ఎవరయ్యిఉంటారని ఆరా తీస్తున్నారు.ఇక బాలయ్య ప్రస్తుతం తన 109 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బోయపాటి తో అఖండ 2 కి కమిట్ అయ్యి ఉన్నాడు. ఇంకో పక్క దిల్ రాజు గేమ్ చేంజర్ తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. కానీ బాలయ్య ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్టార్ట్ చేయడానికి దిల్ రాజు సిద్ధమని సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సినీ పట్టాలెక్కుతుందో చూడాలి.