Entertainment

‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ మూవీ రివ్యూ!


మూవీ : ది గ్రేట్ ఇండియన్ సూసైడ్

నటీనటులు: హెబ్బా పటేల్, నరేష్ వీకే, పవిత్ర లోకేష్, రామ్ కార్తీక్, జయ ప్రకాశ్, రత్న శేఖర్ రెడ్డి, తేజ రెడ్డి, లక్ష్మీ నారాయణ, సాయి కుమార్ బబ్లూ

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: అజయ్ వి. నాగ్

ఎడిటింగ్: ధర్మేంద్ర కకరాల 

రచన, నిర్మాత, దర్శకత్వం: విప్లవ్ కోనేటి

ఓటిటి : ఆహా

ఈ మధ్య కాలంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలని ప్రేక్షకులు ఎక్కువగా ఆచరిస్తున్నారు. దానికి తోడు కాస్త సస్పెన్స్ ఉంటే ఆ సినిమా ఏ ఓటిటి మాధ్యమంలో ఉన్నా చూసేస్తున్నారు. మూఢనమ్మకాలను పాటిస్తూ, చనిపోయిన వారిని తిరిగి తీసుకురావాలని ఆ మధ్య కాలంలో.. ఒకే కుటుంబంలోని వారంతా మాస్ సూసైడ్ చేసుకోవడంతో, ఆ వార్త అప్పుట్లో సంచలనం సృష్టించింది. దాని ఇతివృత్తంగా తీసుకొని ఈ ‘ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ సినిమాని తీసారు. హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కథేంటో ఒకసారి చూసేద్దాం.


కథ:  

ఒకతను కార్లో ఊరిలోకి వెళ్తుండగా అకస్మాత్తుగా అందులో నుండి పొగలు రావడంతో కార్ ని పక్కనే ఉన్న ప్రదేశంలో ఆపుతాడు. ఇక కార్ నుండి పొగలు రావడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సహాయం చేయాలని చూస్తే కార్ పేలిపోతుంది. అందులో నుండి పెద్దగా అరుపులు, కేకలు వినిపిస్తుంటాయి. ఆ తర్వాత ప్రస్తుతాన్ని చూపిస్తూ ఒక కాఫీ షాప్ ని రన్ చేస్తుంటాడు హర్ష(రామ్ కార్తీక్). ఇక అదే కాఫీ షాప్ కి కుకీస్ అమ్మడానికి చైత్ర(హెబ్బా పటేల్) వస్తుంది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఆ తర్వాత చైత్ర వారి ప్రేమ విషయం ఇంట్లో చెప్పేముందు హర్షకి ఒక నిజం చెప్తుంది. అదేంటంటే ఈ చైత్ర పాడ్యమి రోజున మా ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటున్నాం. దాంతో పెద్ద నాన్న మళ్ళీ బ్రతికొస్తాడని చెప్తుంది. చైత్ర అలా మాట్లాడేసరికి హర్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అసలు ఈ జనరేషన్ లో ఇలా ఎందుకని ఆలోచిస్తాడు. అసలేంటో తెలుసుకోవాలని చైత్రని పెళ్ళి చేసుకొని వారింటికి వెళ్తాడు. ఆ తర్వాత చైత్ర వాళ్ళ కుటుంబం అసలెందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? హర్ష వారిని కాపాడాడా? నీలకంఠం తిరిగి వచ్చాడా తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

కారు ప్రమాదంలో నీలకంఠ చనిపోవడంతో ఆసక్తికరంగా మొదలవుతుంది.  అనాథగా ఉన్న హర్ష తన కాఫీ షాప్ ని రన్ చేయడం, అందులోకి కుకీస్ ని తయారు చేసి చైత్ర రెగ్యులర్ గా ఇవ్వడం, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇదంతా కాస్త స్లోగా సాగుతుంది. రెండున్నర గంటల సినిమాలో మొదటి నలభై నిమిషాల కథ చాలా స్లోగా సాగుతుంది. ఆ తర్వాత కథ మెయిన్ పాయింట్ మాస్ సూసైడ్ గురించి ప్రస్తావన రావడం, దానికి హర్ష స్పందచిన తీరు, చైత్రని ప్రేమించిన విధానం అంతా ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది.

చైత్ర కుటుంబాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, వారి మానసిక స్థితిని గమనించడానికి రంగంలోకి దిగిన హర్షకి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయ. దీనిని అతను ఎలా అధిగమించాడనేది చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.  ప్రథమార్ధంలో చెంబు దగ్గర వచ్చే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఒక్కసారిగా ప్రేక్షకుడిని అలా కథలోకి లాగేసుకుంటుంది‌. ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠని రేకెత్తిస్తుంది. 

ఇక ద్వితీయార్థంలో హర్ష ఇన్వెస్టిగేషన్ చేసిన తీరుని క్లైమాక్స్ లో చూపించే విధానం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని చిన్నపిల్లలతో చూడకపోవడమే బెటర్. ఎందుకంటే పిల్లలపై చిన్నతనంలో జరిగే లైంగిక వేధింపులని చివరి పది నిమిషాల్లో డైరెక్టర్ చూపించాడు. ఇక ఒక మాస్ సూసైడ్ చేసుకోవాలనే కుటుంబ సభ్యుల మానసిక స్థితిని తెలియజేస్తూ వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కాస్త బోరింగ్ డైలాగ్స్ వింటాం. అవి పెద్దగా ఆసక్తిగా లేవు. శ్రీచరణ్ పాకాల బిజిఎమ్ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచింది. అజయ్ వి. నాగ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

హెబ్బా పటేల్ నటనతో ఈ మూవీ స్వరూపమే మారిపోయింది. అన్ని భావాలని చక్కగా ప్రదర్శించింది. ఇక హర్షగా చేసిన రామ్ కార్తిక్ ఈ మూవీకి ప్రధాన బలంగా నిలిచాడు. సినిమా మొత్తాన్ని తన భూజాలపై వేసుకున్నాడనిపిస్తుంది. ఇక నీలకంఠంగా నరేష్ పాత్ర ఉన్నంతలో బాగుంటుంది. పవిత్ర తో పాటుగా మిగిలిన వాళ్ళు వారి పాత్ర పరిధి మేరకు నటించారు.

తెలుగు వన్ పర్ స్పెక్టివ్:

సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాలని చూపిస్తూనే చిన్నపిల్లలపై జరిగే లైంగిక వేధింపుల గురించి చాలా సున్నితంగా తీసిన ఈ మూవీని  హ్యాపీగా చూసేయచ్చు. కానీ ఫ్యామిలీతో కాకుండా ఇండివిడ్యువల్ గా చూస్తేనే బాగుంటుంది.

రేటింగ్: 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్



Source link

Related posts

a big roomer on vijay devarakonda

Oknews

తెలుగు సినిమాలో విలన్ గా స్టార్ క్రికెటర్ 

Oknews

వెంకయ్యనాయుడుతో రచ్చ రవి

Oknews

Leave a Comment