Health Care

దుఃఖంలో కూరుకుపోయారా..? ఆరోగ్యానికి మంచిదేనంటున్న నిపుణులు!


దిశ, ఫీచర్స్ : జీవితంలో సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, బాధలు, సంతోషాలు సహజమే కాదు, సాధారణం కూడాను. అయినప్పటికీ చాలామంది సంతోషంగా ఎలా ఉండాలనే విషయం గురించే ఆలోచిస్తుంటారు. నిపుణులు కూడా మీరు జీవితంలో హ్యాపీగా ఉండేందుకు ఏం చేయాలో సలహాలు ఇస్తుంటారు. కానీ దుఃఖాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది దాదాపుగా ఎవరూ చెప్పరు. దుఃఖం సహజమే అయినప్పటికీ దుఃఖిస్తూనే ఉండటం గానీ, దానిని స్వీకరించి ఎదుర్కోకపోవడం గానీ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

దుఃఖం కూడా అవసరమే..

దుఃఖం విశ్వ వ్యాప్తం. ప్రతి ఒక్కరూ దానిని వివిధ మార్గాలలో అనుభవిస్తారు. చాలా మంది అవసరం లేనిదిగానో, తప్పుగానో భావిస్తుంటారు. ఇతరులు దుఃఖంలో ఉన్నప్పుడు మనకెందుకులే అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే.. ఏదో సమయంలో అందరికీ కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన జీవితానికి దుఃఖం కూడా అవసరం. ఎందుకంటే వివిధ బాధలను తట్టుకోవడంలో, ఎదుర్కోవడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందులోనూ పలు రకాలు ఉన్నాయి. అవి ఏవి, ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం.

నష్టపోవడంవల్ల..

మీరు ఏదైనా నష్టపోయినప్పుడు లేదా ముఖ్యమైన వ్యక్తిని మిస్ అయినప్పుడు కలిగేది సాధారణ దుఃఖం. దాని తీవ్రతను బట్టి ఆరు నెలల నుంచి రెండేండ్ల వరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ తరహా దుఃఖంలో ఉన్నవారు భారీ స్థాయిలో భావోద్వేగాలను అనుభవించవచ్చు. సందర్భాన్నిబట్టి కొన్ని ఫిజికల్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు సామాజిక పరమైన ప్రవర్తన, భావోద్వేగాలు దుఃఖాన్ని కారణం అవుతుంటాయి. ఇక నష్టానికి ప్రతిస్పందనగా వచ్చే మరో రకమైన తీవ్రమైన బాధను ఆబ్సెంట్ దుఃఖం అంటారు. ఇక్కడ నష్టం ఉంటుంది కానీ దుఃఖం కనిపించదు.

ముందస్తు భయం

ఇంట్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, కోలుకోలేని జబ్బుల బారిన పడినప్పుడు, వయస్సు మీదపడిన తల్లిదండ్రులు లేదా ఆత్మీయులను సమీప భవిష్యత్తులో కోల్పోతామనే బాధతో ఇది ఏర్పడుతుంది. అలాగే ప్రేమికులు, భార్య భర్తలు ఏవైనా కారణాలవల్ల విడిపోతామని ముందుగానే తెలిసినప్పుడు, అలాగే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పోతాయని తెలిసిన్పపుడు ముందుస్తు దుఃఖం కలుగుతుంది. వాస్తవానికి ఇదొక సవాలుగా ఉంటుంది. అయితే కొందరికి నష్టాన్ని అనుభవించిన తర్వాత దుఃఖాన్ని ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది.

కాంప్లికేటెడ్ ఇష్యూ

వాస్తవానికి తీరని బాధలోంచి కాంప్లికేటెడ్ దుఃఖం పుడుతుంది. చాలాకాలంగా అనుభవిస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కానప్పుడు, బాధలో ఉండగానే మరో బాధలో కూరుకుపోవడం కాంప్లికేటెడ్ దుఃఖానికి కారణం. ఇది వ్యక్తులను చాలా ఆందోళనకు గురిచేస్తుంది. దాని నుంచి బయట పడకపోతే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి తరచుగా దుఃఖంలో ఉండేవారిని గుర్తించడం, నిపుణుల కౌన్సెలింగ్ వంటివి ఇప్పించడం మంచిదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

దీర్ఘకాలిక ప్రభావం

వ్యక్తిగతంగా గానీ, సామాజికంగా గానీ నష్టపోయినప్పుడు, సంవత్సరాలపాటు బాధను అనుభవిస్తున్నప్పుడు దీర్ఘకాలిక దుఃఖం ఏర్పడుతుంది. ఇది సాధారణ దుఃఖానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బాధలు, నష్టాలు వచ్చిపోయేవి కావు. స్థిరంగా కొనసాగుతుంటాయి. సమస్యను ఎదుర్కోవడానికి బాధితులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయినా పరిష్కార మార్గాలు ఉంటాయి.

ఆలస్యంగా గుర్తుకు వచ్చి..

చాలాకాలం క్రితం జరిగిన విషాధ సంఘటనలు, ఓటములు, విడాకులు వంటి సందర్భంలో పెద్దగా బాధపడి ఉండకపోవచ్చు. కానీ కొంత కాలం తర్వాత గుర్తుకు వచ్చి అపరాధభావంతో ఇబ్బంది పడతారు. అప్పట్లో జరిగిన దానిని తల్చుకొని దుఃఖిస్తుంటారు. దీనినే డిలే లేదా ఆలస్యమైన దుఃఖంగా నిపుణులు పేర్కొంటున్నారు. విషయాలు బాధాకరమైనవే కావచ్చు. కానీ వాటిని అంగీకరించి, మనస్ఫూర్తిగా స్వీకరించి దుఃఖించడం ద్వారా కొంతకాలనికి రిలాక్స్ అవుతారని నిపుణులు చెప్తున్నారు.

కోలుకోలేని పరిస్థితిలో..

కొన్నిసార్లు తీవ్రమైన బాధలు కోలుకోలేనివిగా ఉంటాయి. కాలక్రమేణా పెరుగుతుంటాయి కూడా. ముఖ్యంగా తక్కువ వ్యవధిలో సంభవించే ఎక్కువ నష్టాల కారణంగా ఈ దుఃఖం కలుగుతుంది. ఓవర్‌లోడ్ లేదా బీవ్‌మెంట్ దుఃఖం అని కూడా పిలుస్తారు. బయటపడటం కష్టతరమైన దుఃఖాలలో ఇది ఒకటి. అయితే పరిస్థితులు పూర్తిగా సర్దుకోవడం ద్వారా మాత్రమే బయటపడే చాన్సెస్ ఉంటాయి. అలా జరగకపోతే నిపుణుల గైడెన్స్‌ లేదా ట్రీట్మెంట్ ద్వారా ఎదుర్కోవచ్చు.

గుర్తుంచుకోండి!

దుఃఖం బాధలు, భావోద్వేగాలు, కష్టాలు, నష్టాలు వంటి అంశాలతో ముడిపడి ఉన్నందున అందరూ దానికి దూరంగా ఉండాలనుకుంటారు. అయితే ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన సందర్భం వస్తుంది. అలాంటప్పుడు కూడా దుఃఖాన్ని స్వీకరించకపోతే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి దానిని అంగీకరించి హెల్తీ వేలో పరిష్కరించుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు.

Read More..

Fever: జ్వరం రావడం వల్ల లాభాలే ఎక్కువంటూ.. సర్వేలో బయటపెట్టిన నిపుణులు 



Source link

Related posts

వేసవిలో చెరుకు రసం తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా

Oknews

లైంగిక కోరికలు రాకుండా చేసే రోగం.. దీని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Oknews

ఇలా చేశారంటే 50 ఏళ్ల తర్వాత కూడా మీ చర్మం మెరిసిపోతుంది..

Oknews

Leave a Comment