దిశ, ఫీచర్స్ : హర్రర్ స్టోరీస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దెయ్యం గురించి చెప్తే చాలు భయపడుకుంటూనే చాలా ఇంట్రెస్ట్‌గా వింటుంటారు. ఇక దెయ్యాలు ఉంటాయా అంటే ? కొంత మంది అవును అని సమాధానం ఇస్తే మరికొందరు కాదు అని చెప్తారు. ఎవరి నమ్మకం వారిది.
ఇక మనం చాలా కథలు వింటూనే ఉంటాం..చనిపోయిన వారు ఆత్మగా మారి మనచుట్టూ దెయ్యంలా తిరుగుతారు.రాత్రి 12 అయ్యిందంటే చాలు దెయ్యం వస్తుంది. అది ఒంటరిగా ఉంటే మన పక్కనే కూర్చొంటుంది. అంతే కాకుండా దెయ్యాలు వారికి ఇష్టమైన వారి చుట్టే ఎక్కువ తిరుగుతాయి, మరీ ముఖ్యంగా రాత్రికాగానే దెయ్యాలు రోడ్ల మీద ఎగురుతూ కనిపిస్తాయని, ఇలా ఎన్నో కథలు ఉన్నాయి. మరీ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? నిజంగా రాత్రిపూట కనిపిస్తాయా? అసలు రాత్రి సమయంలో ఎందుకు కనిపిస్తాయి. ఈ దెయ్యాల గురించి నిపుణులు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని గురించి అధ్యయనం చేసిన నిపుణులు దెయ్యాల గురించి షాకింగ్ విషయాలను వెళ్లడించారు. ఆత్మలు రాత్రి సమయంలో తమ ఉనికిని విస్తరించేందుకు ఎక్కు ప్రయత్నం చేస్తాయంట.
నిపుణులు మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో దెయ్యాలు నిజంగానే ఉంటాయి. ఎందుకంటే నైట్ టైమ్‌లో ఎలక్ట్రానిక్ డిస్ట్రబెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాత్రి సమయంలో అధిక ఎలక్ట్రానిక్ అడ్డంకులు, రాక్షసులు వారి శక్తిని భంగ పరుస్తాయి, అందువలన రాత్రి సమయంలోనే దెయ్యాలు యాక్టివ్‌గా ఉంటాయంట. అంతే కాకుండా వీటికి వెళ్తురంటే చాలా భయం. అలాగే ఎవరైనా వ్యక్తి రాత్రి సమయంలో ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అంతే కాకుండా తమకు చాలా దగ్గరైన వ్యక్తి చనిపోతే తన గురించే ఆలోచిస్తారు. ఎక్కడో చోట వ్యక్తికి మనసులో ప్రతి కూల భావన ఉంటుంది. ఆ సమయంలో వారు ఎక్కువగా ఆందోళనకు గురి అవుతారు.తమ చుట్టూ ఏదో జరుగుతున్నట్లు, తన వద్దకు ఎవరో వచ్చినట్లు అనిపిస్తుంటుంది. అయితే అలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండటం వలన దెయ్యాన్ని చూడొచ్చు అంటున్నారు. నోట్ : ఇది ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.