EntertainmentLatest News

‘దేవర’లోని రెండో పాట గురించి రామజోగయ్యశాస్త్రి ఏం చెప్పారంటే..!


ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’.  ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మేకర్స్‌. ఇందులో జాన్వీ కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్‌కి దాదాపు రెండు నెలలు సమయం ఉంది. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి పాట సెన్సేషనల్‌ హిట్‌ అయింది. ఈ పాట విడుదలై చాలా రోజులైంది. ఎప్పటి నుంచో రెండో పాట కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారంతా. 

ఈ సినిమాలోని రెండో పాట మెలోడీగా సాగే డ్యూయెట్‌ అని తెలుస్తోంది. ఈ పాటకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ క్యారెక్టర్‌ పేరు తంగం. అందుకే ఆమె పేరు వచ్చే విధంగానే పాట ఉంటుందనే హింట్‌ ఇచ్చారు. ‘తంగం అంతరంగం హాయిగా ఉయ్యాలూగుతున్నట్టుంది.. ఇప్పుడే విన్నా.. త్వరలోనే వచ్చేస్తుందిలే..’ అంటూ ఈ ఎంతో శ్రావ్యంగా సాగుతుంది అనే విషయాన్ని తెలిపారు. ఈ కొత్త అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాటకు అనిరుధ్‌ ఎలాంటి ట్యూన్‌ ఇచ్చాడో, మ్యూజికల్‌గా ఈ పాట ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో, అభిమానుల్లో నెలకొంది.  



Source link

Related posts

petrol diesel price today 29 February 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 29 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

షర్మిలకు కీలక పదవి ఇవ్వనున్న కాంగ్రెస్..!

Oknews

25 ఏళ్ళ వయసులో పెళ్లి కుదరలేదు..ఇప్పడు 40 కదా అంటున్న హీరోయిన్

Oknews

Leave a Comment