ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. ఈ సినిమాకు ఎలాంటి బజ్ రావాలి. ఎలాంటి పబ్లిసిటీ వుండాలి. ఏ రేంజ్ హైప్ సృష్టించాలి. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ యూనిట్ వైపు నుంచి కనిపించడం లేదు.
సినిమా విడుదల మరో రెండు నెలల లోపు సమయంలోకి వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు ఓ చిన్న గ్లింప్స్, ఓ పాట తప్ప మరో వర్క్ ఏదీ బయటకు రాలేదు. ట్రయిలర్, టీజర్ అనేవి సెప్టెంబర్ వరకు ఎలాగూ రావు.
కానీ ఇలాంటి పాన్ ఇండియా సినిమాలకు పాటలు కీలకం. అది కూడా అన్ని భాషల్లో హిట్ కావాలి. తొలి పాట వచ్చింది. ఓకె అనిపించుకుంది. ఫ్యాన్స్ హమ్మయ్య, అనిరుధ్ ను తీసుకున్నందుకు న్యాయం చేసాడు అనుకున్నారు. కానీ సరైన డ్యూయట్ బయటకు రావాలి కదా. అది మాత్రం ఇదిగో అదిగో అంటూ ఊడిపడడం లేదు. యూనిట్ జనాలకే ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.
అన్ని భాషల్లో రెడీ కావాలి కదా, కరెక్షన్లు వుంటాయి కదా, పాన్ ఇండియా సినిమా కదా ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. జులై చివరి వారంలో ఇస్తారు అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అది కాస్తా దాటిపోయింది. జులై నెలాఖారు కాస్తా అగస్ట్ తొలివారానికి వచ్చింది. తొలివారం ఇక రెండు రోజుల వుంది. మరి ఇప్పటి వరకు అనౌన్స్ మెంట్ లేదు. ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అప్ డేట్ నో రామచంద్రా అంటూ గోల పెడుతున్నారు.
ఇంతకీ అనిరుధ్ పాట ఎప్పుడు ఇస్తాడో, అది ఎలా వుంటుందో అన్నది ఓ టెన్షన్. పాట ఏ మాత్రం బాగులేకున్నా యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. ముందు దాన్ని తట్టుకోవాలి. కొరటాల మీద వదిలేసారో, లేదా హీరో తానే సీరియస్ గా తీసుకోవడం లేదో. మొత్తం మీద దేవర సినిమా బజ్ పెంచుకోవడంలో దారుణంగా వెనుకపడింది అన్నది మాత్రం వాస్తవం.
The post ‘దేవర’ ఏం జరుగుతోంది! appeared first on Great Andhra.