Entertainment

‘దేవర’ కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు!


ఒక బడా సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం విడుదలకు చాలా రోజుల ముందు నుంచే తీవ్ర పోటీ నెలకొనడం సహజం. ఇప్పుడు ‘దేవర'(Devara) విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం బడా నిర్మాతలు పోటీ పడుతున్నారట. చిత్ర నిర్మాతలు రికార్డు ప్రైస్ చెప్తున్నప్పటికీ.. ఆ బడా నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయట్లేదట.

‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ‘దేవర’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. దీంతో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు, మైత్రి మూవీస్ పోటీ పడుతున్నారట. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రికార్డు ధరకు ‘దేవర’ తెలుగు స్టేట్స్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది.

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.



Source link

Related posts

వెయ్యి మంది స్టార్స్ కలిస్తే నా కొడుకు.. పవన్ ఫ్యాన్స్ పై ప్రభాస్ తల్లి కీలక వ్యాఖ్యలు

Oknews

కల్కి 2898 ఏడి  మీద  నారా లోకేష్ రివ్యూ ఇదే   

Oknews

అల్లు అర్జున్ యాక్టింగ్ బీస్ట్ అంటున్న సమంత 

Oknews

Leave a Comment