EntertainmentLatest News

దేవర పార్ట్ 2 కోసం వెయిటింగ్…


‘దేవర’ (Devara) షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు నటీనటులు తమ డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేశారు. తాజాగా టెంపర్ వంశీ కూడా తన డబ్బింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశాడు. 

దేవరలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేసినట్లు టెంపర్ వంశీ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అంతేకాదు, “దేవర పార్ట్ 2 లో ఎన్టీఆర్ అన్నతో కలిసి వర్క్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” అని వంశీ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Related posts

ప్రభాస్ కి ఎన్టీఆర్ అడ్డమో, ఎన్టీఆర్ కి ప్రభాస్ అడ్డమో ప్రశాంత్ నీల్ చెప్పాలి 

Oknews

జ్యోతిక భర్త అప్పుగా కావాలంట..ఈ విషయం సూర్యకి తెలిస్తే 

Oknews

Nalgonda’s Political Leaders’ Attempts To Dominate Mother Dairy Are Becoming Controversial. | Mother Dairy Issue : మదర్ డెయిరీపై ఆధిపత్యం కోసం ఎత్తలు

Oknews

Leave a Comment