Entertainment

‘దేవర’ రిలీజ్‌ డేట్‌ను కొట్టేసిన దిల్‌రాజు!


ఈమధ్యకాలంలో సినిమాల రిలీజ్‌ విషయంలో కొంత గందరగోళం నెలకొంటున్న సంగతి తెలిసిందే. పలు కారణాలతో రిలీజ్‌ డేట్లను వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్‌. గత సెప్టెంబర్‌ నుంచి ఎన్నో సినిమాలు అనుకున్న డేట్స్‌కి రిలీజ్‌ కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండయా మూవీ ‘దేవర’ రెండు భాగాలుగా రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. మొదటి భాగాన్ని ఏప్రిల్‌ 5న సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చెయ్యాలని మేకర్స్‌ భావించారు. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌కు శస్త్రచికిత్స జరిగింది. ఆ కారణంగా కొంతకాలం షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో ‘దేవర’ షూటింగ్‌కి బ్రేక్‌ పడిరదని, ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిరదన్న వార్తలు వచ్చాయి. 

ఇక విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. ఆ టైమ్‌కి షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో రిలీజ్‌ను వాయిదా వేశారు నిర్మాత దిల్‌ రాజు. సమ్మర్‌లో రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశారని తెలుస్తోంది. అయితే ‘దేవర’ చిత్రం రిలీజ్‌ వాయిదా పడిరదన్న వార్త బయటికి రావడంతో ఫ్యామిలీ స్టార్‌కి అదే మంచి సమయం అనీ, ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకోవద్దని సోషల్‌ మీడియాలో పలువురు సూచించారు. అందుకో, మరెందుకో తెలీదుగానీ దిల్‌రాజు తమ ‘ఫ్యామిలీ స్టార్‌’ను ఏప్రిల్‌ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ సోషల్‌ మీడియాలో స్ప్రెడ్‌ కావడంతో ‘దేవర’ రిలీజ్‌ డేట్‌ని దిల్‌రాజు కొట్టేశారంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్‌ దేవరకొండ, దిల్‌ రాజులకు తమ సినిమా రిలీజ్‌ చేసుకునేందుకు మంచి డేటే దొరికిందని చెప్పాలి. 



Source link

Related posts

‘భీమా’ మూవీ రివ్యూ

Oknews

ఎన్టీఆర్ మీద ట్రోల్స్ స్టార్ట్ చేసిన బాలీవుడ్.!

Oknews

‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ.. నాని, విజయ్ సినిమాలకు ముప్పు!

Oknews

Leave a Comment