బాలీవుడ్‌లో టాప్ హీరో అయి ఉండి తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించడానికి కూడా ఓకే చెబుతున్నారంటే తెలుగు సినిమా ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’లో రావణాసురుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘దేవర’లో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో గ్యాప్ లేకుండా త్వరగా ఫినిష్ చెయ్యాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ‘దేవర’ షూటింగ్‌లో గాయపడ్డాడు. అతని మోకాలికి, భుజానికి గాయాలైనట్టు తెలుస్తోంది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. ఆయన ట్రైసెప్స్‌కు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. సైఫ్‌కి తోడుగా ఆయన భార్య కరీనా కపూర్ ఆస్పత్రిలోనే ఉన్నారు. సైఫ్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఇప్పట్లో అతను ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్టు ఏప్రిల్ 5న మొదటి భాగం రిలీజ్ అవ్వాలంటే నిర్విరామంగా షూటింగ్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.