EntertainmentLatest News

దేవర సాంగ్ పై ట్రోల్స్.. కొండను చూసి కుక్క మొరిగితే కొండకు చేటా…


ఒకప్పుడు ఏదైనా సినిమా నుంచి సాంగ్ విడుదలైతే.. ఆ సాంగ్ బాగుందా లేదా అనే చర్చ జరిగేది. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఏదైనా సాంగ్ విడుదలైతే.. అది ఏ సాంగ్ కి కాపీ అనే చర్చలు జరుగుతున్నాయి. సాంగ్ రిలీజ్ అయిన నిమిషాల్లోనే.. అది ఫలానా సాంగ్ కి కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా ‘దేవర’ సెకండ్ సింగిల్ విషయంలోనూ అదే జరుగుతోంది. (Devara Second Single)

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దేవర’ (Devara). అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా “చుట్టమల్లే” (Chuttamalle) సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు. మ్యూజిక్, విజువల్స్ తో పాటు.. సాంగ్ లో ఎన్టీఆర్, జాన్వీల కెమిస్ట్రీ అదిరిపోయిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. దాంతో విడుదలైన గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది ఈ సాంగ్. అయితే ప్రశంసలతో పాటు ట్రోల్స్ కూడా అదే స్థాయిలో “చుట్టమల్లే” సాంగ్ ని చుట్టుముడుతున్నాయి. శ్రీలంక పాపులర్ సాంగ్ “మానికే మాగే హితే”కి కాపీలా ఉందని కొందరు ట్రోల్ చేస్తుంటే.. మరికొందరేమో ‘గుంటూరు కారం’లోని “ఓ మై బేబీ” సాంగ్ లా ఉందని ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కొందరు ట్రోలర్స్ అయితే.. విజువల్స్ ని కూడా వదిలిపెట్టడంలేదు. లిరిల్ సోప్ కొత్త యాడ్ లా విజువల్స్ ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మేరకు కొన్ని వీడియోస్ ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

అయితే ఈ ట్రోల్స్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ధీటుగా బదులిస్తున్నారు. “కొండను చూసి కుక్కలు మొరిగితే కొండకు చేటా” అంటూ ‘అరవింద సమేత’ మూవీలోని ఎన్టీఆర్ డైలాగ్ తో కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో “చుట్టమల్లే” సాంగ్ సూపర్ గా ఉందంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అనిరుధ్ అందించిన మ్యూజిక్ బ్యూటిఫుల్ గా ఉందని, ఎన్టీఆర్-జాన్వీ జోడీని కొరటాల ఎంతో అందంగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ కి ఇలాంటి బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ పడిందని, బిగ్ స్క్రీన్ పై ఈ సాంగ్ కన్నులపండుగలా ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి దేవర సెకండ్ సింగిల్.. ప్రస్తుతం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది.



Source link

Related posts

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు

Oknews

పవన్‌కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన వై.ఎస్‌.జగన్‌కు బండ్ల గణేష్‌ కౌంటర్‌

Oknews

Minister Uttam Kumar Reddy on KCR Jagan : కేసీఆర్ – జగన్ బంధంపై మంత్రి ఉత్తమ్ ఆరోపణలు | ABP Desam

Oknews

Leave a Comment