EntertainmentLatest News

దేవర సెకండ్ సాంగ్.. చానా ఏళ్ళు యాదుంటది!


‘దేవర’ (Devara) సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం మామూలుగా లేదు. సెకండ్ సింగిల్ గా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ ని ఆగస్ట్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్, జాన్వీల రొమాంటిక్ పోస్టర్ అదిరిపోవడం.. ప్రోమోలా విడుదల చేసిన మ్యూజిక్ బిట్ ఇంకా అదిరిపోవడంతో అభిమానుల ఆనందం రెట్టింపయింది. ఇక తాజాగా టైం కూడా లాక్ అయింది. ఈ సాంగ్ ని రేపు(ఆగస్ట్ 5) సాయంత్రం 5:04 కి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ సాంగ్ చాలాకాలం వినిపిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. (Devara Second Single)

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ గా ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్’ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రాబోతున్న సెకండ్ సింగిల్ అంతకుమించిన రెస్పాన్స్ తెచ్చుకుంటుందనే అంచనాలున్నాయి. కాగా, దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Source link

Related posts

మహేశ్ బాబు హాలివుడ్ ఎంట్రీ …?

Oknews

ప్రియదర్శి కి హీరోయిన్ వార్నింగ్..మేము అంటే కేసు పెడతారా 

Oknews

రేణు దేశాయ్‌కి మళ్లీ పెళ్లి.. అడ్డు పడుతున్న పవన్‌కళ్యాణ్‌ పిల్లలు!

Oknews

Leave a Comment