చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు ప్రచారంలో ఘటన
ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఎన్నికలు ప్రచారం(Election Campaign) మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలోని పెనుగొండ మండలం సిద్ధాంతం(Siddhantam) గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఆ గ్రామంలోని వినాయకుడిని దర్శించుకుని, పూజలు చేయాలనుకున్నారు. ఈ క్రమంలో పూజలు నిర్వహిస్తుండగా ఆలయ పూజారి…మాజీ మంత్రి రంగనాథరాజుకు స్వాగతం పలికి పూజా కార్యక్రమానికి అంతా సిద్ధం చేశారు. అర్చనకు తెచ్చిన పండ్లు, పువ్వులు, వస్త్రాలు భగవంతుడు ముందు ఉంచి పూజలు చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు దేవాలయాలకు వస్తే… వాళ్లు తెచ్చిన దండలను దేవుడు మెడలో లేదా పాదాల వద్ద ఉంచి తిరిగి ఆ నేతల మెడలో వేస్తారు. పూజ పూర్తైన తర్వాత పూలు, పండ్లు ఇచ్చి దేవుని వస్త్రంతో వారికి ఆశీర్వచనాలు ఇస్తారు.