అసలేం జరిగిందంటే?సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పలువులు మంత్రులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని(Yadagirigutta Temple) దర్శించుకున్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కూడా పాల్గొన్నారు. యాదాద్రి బ్రహ్మోత్సవాల(Yadadri Brahmotsavalu) ప్రారంభోత్సవం సందర్భంగా తొలిపూజలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దంపతులు పాల్గొన్నారు. సీఎంతోపాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ(Konda Surekha) ఎత్తు పీటలపై కూర్చొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీట లేకపోవడంతో ఆయన కింద కూర్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు కంకణధారణ చేసి, వేదాశీర్వచనాలు అందించారు.
Source link