Dhoni Trump Golf: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా టూర్ లో ఉన్న ఈ మిస్టర్ కూల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఒక రోజు ముందే న్యూయార్క్ లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో అల్కరాజ్, జ్వెరెవ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూసిన ధోనీ.. ఇప్పుడు ఏకంగా ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడటం విశేషం.